డ్యామిట్‌.. హ‌ర్యానాలో కాంగ్రెస్ క‌థ అడ్డం తిరుగుతోంది!

హ‌ర్యానాలో ఎన్నిక‌ల ఫ‌లితాలు క్ష‌ణ‌క్ష‌ణానికి మారుతున్నాయి. ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైన త‌ర్వాత గంట పాటు కాంగ్రెస్ ఆధిక్యంలో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఆ పార్టీ క‌థ అడ్డం తిరుగుతోంది. బీజేపీ ఆధిక్య‌తలో కొన‌సాగుతోంది. ఇదే…

హ‌ర్యానాలో ఎన్నిక‌ల ఫ‌లితాలు క్ష‌ణ‌క్ష‌ణానికి మారుతున్నాయి. ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైన త‌ర్వాత గంట పాటు కాంగ్రెస్ ఆధిక్యంలో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఆ పార్టీ క‌థ అడ్డం తిరుగుతోంది. బీజేపీ ఆధిక్య‌తలో కొన‌సాగుతోంది. ఇదే రీతిలో బీజేపీ మెజార్టీలు సాగితే మాత్రం… హ‌ర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం.

హ‌ర్యానాలో రౌండ్‌రౌండ్‌కు ఫ‌లితాలు మారుతుండ‌డం తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మూడోసారి బీజేపీ అధికారంలోకి రాలేద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇవే నిజ‌మ‌య్యేలా మొద‌టి రౌండ్ల ఫ‌లితాలు వ‌చ్చాయి. అయితే స‌మ‌యం గ‌డిచేకొద్ది బీజేపీ పుంజుకోవ‌డం విశేషం.

హ‌ర్యానాలో అధికారాన్ని కోల్పోతున్నామ‌న్న నిస్పృహ‌లోకి వెళ్లిన బీజేపీ శ్రేణులు… మారుతున్న ట్రెండ్స్‌తో మ‌ళ్లీ ఊపిరి పీల్చుకున్నాయి. ప్ర‌స్తుతం హర్యానాలో బీజేపీ 50 చోట్ల‌, కాంగ్రెస్ 34 చోట్ల ఆధిక్య‌త‌లో కొన‌సాగుతుండ‌డం విశేషం. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 46. ఈ లెక్క‌న చూస్తే ప్ర‌స్తుతానికి బీజేపీ ఆశాజ‌న‌క సీట్ల‌తో ముందంజ‌లో కొన‌సాగుతోంది.

జ‌మ్మూ కశ్మీర్‌లో మాత్రం కాంగ్రెస్ కూట‌మి 48 సీట్ల‌తో ముందంజ‌లో దూసుకెళుతోంది. బీజేపీ మాత్రం 29 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. హ‌ర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. హ‌ర్యానాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశ‌లు చివ‌రికి ఏమ‌వుతాయో చూడాలి.

5 Replies to “డ్యామిట్‌.. హ‌ర్యానాలో కాంగ్రెస్ క‌థ అడ్డం తిరుగుతోంది!”

Comments are closed.