స్టయిలిష్ స్టార్ బన్నీ క్యారవాన్ ఓ స్పెషల్. అన్నీ తనకు నచ్చినట్లు స్పెషల్ గా, స్టయిలిష్ గా డిజైన్ చేయించుకునే బన్నీ దీన్ని కూడా ఫుల్ బ్లాక్ కలర్ లో బాగా తయారుచేయించుకున్నాడు. బన్నీ ఎక్కడ షూట్ కు వెళ్తే అక్కడకు ముందుగా ఈ వ్యాన్ వెళ్లిపోయితుంది.
ఇటీవల పుష్ప షూటింగ్ రంపచోడవరం ప్రాంతంలో జరుగుతుంటే ఈ క్యారవాన్ అక్కడకు వెళ్లింది. షూటింగ్ షెడ్యూలు ముగియడంతో బన్నీ రిటర్న్ అయిపోయారు. కానీ క్యారవాన్ మాత్రం వేరుగా రావాల్సి వుంది. ఈ క్రమంలో వస్తుండగా ఖమ్మం సమీపంలోని సత్యనారాయణ పురం వద్ద ప్రమాదానికి గురయింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా.. వెనక నుంచి వచ్చిన కంటెయినర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కార్‌వాన్ వెనక భాగం మాత్రమే ధ్వంసమైంది. పూర్తిగ సొట్టలు పడి అంద విహీనంగా తయారయింది.