నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా వరుడు కావలెను. సౌజన్య దర్శకురాలు. ఈ సినిమా షూటింగ్ చకచకానే జరుగుతోంది. కానీ జరుగుతున్న కోద్దీ సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమాకు స్క్రిప్ట్ నే ఒకటికి రెండు సార్లు, ఇద్దరు ముగ్గురుతో రాయించి, ఆఖరికి ఫైనల్ చేసారు. కానీ చిత్రమేమిటంటే దాదాపు 70శాతం వరకు సినిమా అయిపోయిన తరువాత సీన్లు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారని బోగట్టా. దీంతో ఈ సినిమా షూట్ సశేషం అన్నట్లుగా తయారవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిర్మాత చినబాబు అమితంగా ఇష్టపడి, అన్ని విధాలా టెక్నికల్ అండ్ స్టార్ కాస్ట్ ప్యాడింగ్ అరేంజ్ చేసి చేయిస్తున్న సినిమా.
ఈ సినిమా నుంచి ఓ పాట వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాను వీలయినంత త్వరగా పూర్తి చేసి, ఈ సమ్మర్ కు అటు ఇటుగా విడుదల చేయాలన్నది నిర్మాతల సంకల్పం.