క్షణక్షణం ఫస్ట్ లుక్

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్,  జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. టైటిల్ కి తగ్గట్టుగానే ఆద్యంతం ఉత్కంఠంగా సాగే ఈ డార్క్…

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్,  జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. టైటిల్ కి తగ్గట్టుగానే ఆద్యంతం ఉత్కంఠంగా సాగే ఈ డార్క్ కామెడీ జానర్ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.  దర్శకుడు మారుతి క్షణక్షణం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ‘ ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ నటించిన క్షణ క్షణం ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను.’ అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ‘ . మొదటి సినిమా నుండి  కాన్సెప్ట్ ఓరియంటెండ్  స్ర్కిప్ట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్షణ క్షణం తప్పకుండా మా టీంకి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 

దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ‘  క్షణ క్షణం ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. పాటలు చాలా బాగా వచ్చాయి. సిట్యువేషనల్ గా  వచ్చే పాటలు సినిమా మూడ్ ని మరింత ఎలివేట్ చేస్తాయి. చాలా రియలిస్టిక్ గా సినిమాను మలిచాము త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ’ అన్నారు.