గంటా శ్రీనివాసరావు తెలివైన రాజకీయ వేత్త. ఎవ్వరు ఏమి అనుకున్నా ఆయన సరైన టైమ్ ఎక్కడి నుంచి ఎక్కడకు జంప్ చేయలన్నది భలే డిసైడ్ చేసుకుంటారు.
ఎవరు ఏమనుకున్నా, సరైన టైమ్ లో సరైన నియోజకవర్గం ఎంచుకోవడం, సరైన పార్టీని ఎంచుకోవడం అన్నది ఆయనకే చెల్లిన విద్య.
2019లో తెలుగుదేశం దారుణ పరాజయం పాలయినా, ఆయన మాత్రం తన ఎమ్మెల్యే పదవి తాను నిలబెట్టుకున్నారు. కానీ సమయం చూసి వైకాపాలోకి జంప్ చేయలనుకుంటే కుదరలేదు.
చాలా మంది అడ్డం పడ్డారు. భాజపాలోకి వెళ్దామంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత సీన్ వుందా అన్న అనుమానం. ఇలా జంఝాటంలో వుంటూ, తెలుగుదేశానికి దూరంగా వుంటూ వస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో మాంచి చాన్స్ వచ్చింది. విశాఖ ఉక్కు వ్యవహారం మీద తన నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చారు.
సరే ఆ రాజీనామా ఆమోదం, తదితర వ్యవహారాలు అలా వుంచితే, సిటీ పరిథిలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి మాత్రం ఈ ఎత్తగడ గట్టిగా ఉపయోగపడుతుంది. రేపు రాబోయే మేయర్ ఎన్నికల్లో ఆయన చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. దానికి ఈ మూవ్ బాగా పనికి వస్తుంది.
జనసేనలోకి ఆయన వెళ్లలేరు. పవన్ కు ఆయనకు సరిపడదు. జనసేన కలిసిన భాజపాలోకి కూడా డవుటే. వైకాపాలోకి వెళ్లాలంటే చాలా మంది అడ్డం వున్నారు. తెలుగుదేశంలోనే కొనసాగాలి. కానీ అలా కొనసాగాలి అంటే ఆయనకు ఓ ఐడెంటిటీ బలంగా వుండాలి.
వైకాపా నుంచి సవాళ్లు ఎదురుకానంత బలంగా వుండాలి. దానికి ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తున్న ఉక్కు జేఎసి సరిగ్గా సరిపోతుంది. రక్షణ కవచంగా వుంటుంది.