నాగ్ Vs సురేఖ.. కేసులో కొత్త మలుపు

నాగార్జునపై, అతడి కుటుంబంపై, సమంతాపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ, నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెపై కోర్టులో క్రిమినల్…

నాగార్జునపై, అతడి కుటుంబంపై, సమంతాపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ, నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెపై కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు.

ఈ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి స్పెషల్ కోర్టు, ఇప్పటికే నాగార్జున స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించి మరో సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ ను కూడా ఈరోజు రికార్డ్ చేసిన కోర్టు.. మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

నాగార్జున, సుప్రియ, వెంకటేశ్వర్లు స్టేట్ మెంట్స్ ఆధారంగా నోటీసులిచ్చిన కోర్టు.. కేసును 23వ తేదీకి వాయిదావేసింది. నాగార్జున ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రిని ఆదేశించింది.

దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతూ, ఎన్నో అవార్డులు పొందుతూ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ… గౌరవ ప్రతిష్టలతో బతుకుతున్న తమపై మంత్రి కొండా సురేఖ, ఉద్దేశపూర్వకంగా, అత్యంత అసభ్యంగా, సభ్యసమాజం సిగ్గుపడేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని నాగార్జున ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు పడిన మనోవేదనను మాటల్లో వర్ణించలేమన్నారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ తన స్టేట్ మెంట్ లో కోర్టును కోరారు.

మరోవైపు కొండా సురేఖపై కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ పై విమర్శలు గుప్పించే క్రమంలోనే నాగార్జునపై, ఆయన కుటుంబంపై మంత్రి ఆరోపణలు చేశారు. కేటీఆర్ తరఫున ఆయన లాయర్ ఉమామహేశ్వరరావు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ సాక్ష్యులుగా చేరారు.

34 Replies to “నాగ్ Vs సురేఖ.. కేసులో కొత్త మలుపు”

  1. She needs to be punished, no doubt. But the sad facts are

    A)I am totally unhappy with Surekha to fall prey for the greed/manipulatiom of BCs by worthless Doralu Yesr,crmnl jag,fraud Revanth and Ettu pirrala KTR. This is a perfect example of how human mind gets overwhelmed by greed/ power from being Doralu bashing Naxalite to pampering them to a totally humiliation of BC self respect .

    B)This is a gleeful situation for All Doralu as to how they can continue to manipulate BC/SCs for another 50 years in the comfort of feeling,with the likes of Surekha their future and positions are safe

    Share

    C)Sadly,she couldn’t even live up to the expectations of rogue director and self proclaimed iconoclastic (however fake for survival sake and to attract confused min.

    Islamic transgenders like SWAPNA go scot free by very diplomatic attacks on Pawan due to their brahminic cunningness

  2. దీంట్లో కొత్త మలుపు ఏముంది? ఇద్దరూ దావా లు వెయ్యడం తెలుసు కదా!

  3. పొట్టోడి ప్రమెయం లెకుండా సురెఖ అక్క ఇంత పెద్ద మాట అన్నది అంటె నమ్మ బుద్ది కావట్లెదు

        1. లంచం తీసుకునేవాడు రసీదు ఇచ్చి తీసుకుంటాడా ? ఇక్కడ కేటీఆర్ కూడా అంతే చీర అంతే తెలియని సమంతకి చేనేత వస్త్రాలకి అంబాసిడర్ అని మాటి మాటికీ పిలిచి వాడుకున్నాడు

          1. జగన్ రెడ్డి చేసాడు గా మైనింగ్ నిందితురాలు శ్రీలక్ష్మి ని , రోజా ని , శ్యామల ని , శ్రీ రెడ్డి ని , తానేటి వనిత ని , గజ్జల కాంతాన్ని ? ముక్కొడేమో స్మిత సబర్వాల్ , సబితా ఇంద్రా రెడ్డి ని ఫార్మ్ హౌస్ లో ??

  4. Konda Surekha should have spoken with proofs in hand. Then it would have been very difficult for Nagarjuna and KTR to go aggressive on her. She has been in politics for so long she should have known at least that much. She was foolish to open her mouth on such things without showing any evidence.

    There is a price to pay for being foolish and hasty and she is paying for that.

  5. కొండా సురేఖ కు ఒక కూతురు ఉందిగా, అలా బుద్ధి లేకుండా మాట్లాడటం తప్పు, రాజకీయ లబ్ధి కోసం ఇలా దిగజారి మర్యాద పోగొట్టుకోవడం ఆమె పిచ్చికి పరాకాష్ట

          1. ఒరేయ్ నీ మాటల్లోనే అర్థమవుతుంది నువ్వెంత నీచాతి నీచూడవు అని ఎదుటి వాళ్ళని అమర్యాదగా మాట్లాడే కుక్కవి, నీతో వాదన కూడా waste రా సంస్కారం లేని వెధవ

  6. అంతా బాగానే ఉంది. ఇందులో కొత్త మలుపు ఎక్కడ ఉంది.. ఇందులో ఎక్కడైనా మలుపు వుంటే కొంచెం చెప్పండయ్యా..

  7. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కోర్టు కు సమర్పించాలి. అప్పుడు అందరి బండారం బట్టబయలు అవుతాది.

  8. కొండ సురేఖ మీద ట్రోలింగ్ జరిగింది,దాంతో ఆమె విచక్షణ కోల్పోయి ఇలా దిగజారి విమర్శలు చేసింది.అధికారం చేతిలో ఉంది,ట్రోల్లింగ్ చేసినోళ్ళని అరెస్టు చేసి,శిక్ష వేయించి ఉండచ్చు,కానీ బుర్ర పని చెయ్యక,ఏదేదో వాగి,అనవసరంగా పెంట చేసుకుంది.

  9. నువ్వు ఆక్రమించి ఎ అనుమతులు లెకుండా కట్టిన నీ కన్వెషన్ తొనె నీ పరువు పొయింది!

    అయినా కెసు వెస్తె సమంత వెయాలి కాని నువ్వు కాదు కదా!

    1. నాగార్జున ని, నాగచైతన్య ని కదా అన్నది..కేటీఆర్ దగ్గరకి వెళ్లమని ఒత్తిడి చేసారు అని.. అక్కడ సమంత ని ఏమన్నది? ఆమె అందుకే విడాకులు ఇచ్చింది అని చెప్పింది. ఒక రకంగా సమంత ని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అన్నట్లు పొగిడింది.

Comments are closed.