వైజాగ్ పూర్ణా మార్కెట్లో వాసు కూలీగా జాయిన్ అవుతాడు. అక్కడే పెరిగి పెద్దవుతాడు. అక్కడే హీరోయిన్ ను కలుస్తాడు. అతడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ పూర్ణా మార్కెట్లోనే జరుగుతాయి. అతడి ఎదుగుదలలో పూర్ణా మార్కెట్ పెద్ద పాత్ర పోషిస్తుంది.
మట్కా సినిమాలో హీరో క్యారెక్టర్ ఇది. దీన్ని బట్టి సినిమాలో పూర్ణా మార్కెట్ ఎంత కీలకమనే విషయం అర్థమౌతుంది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా ఈ సెట్ ను తీర్చిదిద్దారు. అప్పట్లో సినిమా బడ్జెట్ చేయి దాటుతోందనే పుకార్లు రావడానికి కారణం కూడా ఈ పూర్ణా మార్కెట్ సెట్టే.
అలాంటి కీలకమైన సెట్ కు సంబంధించి వీడియో రిలీజ్ చేసింది మట్కా యూనిట్. మార్కెట్ తో పాటు పూర్ణా టాకీస్ ను కూడా సెట్ గా వేశారు.
“సినిమాలో మార్కెట్ చాలా పెద్ద పాత్ర పోషించింది. ఫస్టాఫ్ ఎక్కువగా ఈ మార్కెట్లోనే నడుస్తుంది. దీంతో పాటు పూర్ణా థియేటర్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అందుకే చాలా రీసెర్ట్ చేసి, పాత ఫొటోలు సంపాదించి పూర్ణా టాకీస్ సెట్ కూడా వేశాం. ఒకప్పుడు పూర్ణా టాకీస్ చాలా ఫేమస్. దాన్ని రీక్రియేట్ చేసి అక్కడ చాలా సీన్స్ తీశాం.”
1989 కాలాన్ని ప్రతిబింబించేలా 10 ఎకరాల విస్తీర్ణంలో పూర్ణా మార్కెట్ సెట్ వేశారు. ఇందులో 250 షాపులు.. ఫిష్ మార్కెట్ కింద మరో 150 షాపులు.. ఇంకొన్ని మాంసం దుకాణాలు సెట్ గా వేశారు. మార్కెట్ చుట్టూ 4 వీధులు ఏర్పాటుచేశారు. వాటిలో మరో 800 షాపులు.. ఇవన్నీ కలిపి ఓవరాల్ గా 1400 షాపులతో ఈ సెట్ వెలిసింది. దీంతో పాటు, అప్పటి కాలానికి తగ్గట్టు ఫొటో స్టుడియో, రిక్షాలు, కార్లు అన్నీ పెట్టారు. మట్కా సినిమాలో ఈ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
Call boy works 9989793850
vc available 9380537747
ఐనా థియేటర్లో చూడం