హైకోర్టులో హీరోయిన్ కు ఊరట

అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపటికి నటి శిల్పాశెట్టి, తన బంగ్లా ఖాళీ చేయాలి. కానీ ఆమెకు ఆఖరి నిమిషంలో ఊరట లభించింది. బంగ్లా ఖాళీ చేసే విషయంలో కోర్టు స్టే ఇవ్వడంతో శిల్పాశెట్టి, రాజ్…

అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపటికి నటి శిల్పాశెట్టి, తన బంగ్లా ఖాళీ చేయాలి. కానీ ఆమెకు ఆఖరి నిమిషంలో ఊరట లభించింది. బంగ్లా ఖాళీ చేసే విషయంలో కోర్టు స్టే ఇవ్వడంతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఊపిరి పీల్చుకున్నారు.

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై కొన్నాళ్లుగా మనీ ల్యాండరింగ్ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబయి జోనల్ ఆఫీస్, అతడికి చెందిన 97.79 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎటాచ్ చేస్తూ నోటీసులిచ్చింది.

నోటీసుల ప్రకారం, 13వ తేదీకి శిల్పాశెట్టి, కుద్రా.. తాము ఉంటున్న జుహు బంగ్లాను ఖాళీ చేయాలి. దాంతో పాటు పానా లేక్ దగ్గరున్న మరో ఖరీదైన భవంతిని కూడా కోల్పోవాల్సి ఉంది. దీనిపై శిల్పాషెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై కోర్టు స్టే ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

2017లో వెలుగుచూసిన క్రిప్టోకరెన్సీ పోంజీ స్కామ్ లో శిల్పాశెట్టి దంపతులకు ప్రమేయం ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. బిట్ కాయిన్స్ ద్వారా ప్రతి నెల కనీసం 10శాతం రిటర్న్స్ వస్తాయని నమ్మించి, కుంద్రాతో పాటు మరికొందరు రూ.6600 కోట్లు పోగేశారనేది ప్రాధమిక ఆరోపణ. ఇందులోంచి 285 బిట్ కాయిన్స్ విత్ డ్రా చేసి, ఆ డబ్బుతో ఉక్రెయిన్ లో ఓ మైనింగ్ ల్యాండ్ కొన్నాడని ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

దీనికి సంబంధించి చర్యలకు దిగిన ఈడీ, రాజ్ కుంద్రా, శిల్పాశెట్టికి చెందిన 97.79 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎటాచ్ చేస్తూ నోటీసులిచ్చింది. ఇప్పుడీ నోటీసులపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది.

6 Replies to “హైకోర్టులో హీరోయిన్ కు ఊరట”

Comments are closed.