నాగార్జునపై, ఆయన కుటుంబ సభ్యులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. టాలీవుడ్ ను కదిలించింది ఈ వివాదం. దీనిపై నాగార్జున ఏకంగా మంత్రిపై క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు.
చాన్నాళ్ల తర్వాత నాగార్జున ఇష్యూపై ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ముక్తకంఠంతో కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించింది. ఓవైపు ఇంత జరుగుతుంటే, ఆ వివాదంపై వెరైటీగా స్పందించాడు నిర్మాత నాగవంశీ. నాగార్జున-కొండా సురేఖ ఇష్యూ జరిగిన టైమ్ లో ఆయన ఇండియాలో లేరంట.
“నాగార్జున ఇష్యూ జరిగినప్పుడు నేను ఇండియాలో లేను. నాకు అస్సలు తెలియదు. నిజంగా నేను చూడలేదు. నేను ఇండియాలో ఫ్లయిట్ ఎక్కగానే ఫోన్ ఆపేస్తాను. ప్రపంచంలో ఎవ్వరికీ దొరకను. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఈమధ్య నేను ఈ ఇష్యూ గురించి ఏం వినలేదు.”
తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఈ వివాదంపై పరిశ్రమకు చెందిన నాగవంశీ స్పందన ఇది. ఇష్టం లేకపోతే ‘నో కామెంట్’ అంటే సరిపోతుంది. కానీ ఇలా చూడలేదు, వినలేదు అంటూ కొత్త వివాదం రేపుతున్నాడీ నిర్మాత. డొంక తిరుగుడు సమాధానం వద్దంటూ వారిస్తే, తను స్ట్రయిట్ గానే చెబుతున్నానని, ప్రపంచంలో ఏం జరిగితే నాకెందుకని అన్నాడు.
“నేను స్ట్రయిట్ గానే చెబుతున్నాను. నేను నా సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్నాను. ప్రపంచంలో ఏం జరిగితే నాకెందుకు. నా డబ్బు జాగ్రత్తగా ఉందా లేదా నా డిస్ట్రిబ్యూటర్లు బాగున్నారా లేదా అనేది నేను చూసుకుంటాను.”
అత్యంత వివాదాస్పదమైన నాగార్జున, కొండా సురేఖ ఇష్యూపై టాలీవుడ్ యాక్టివ్ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ రియాక్షన్ ఇది. ఈ అంశం తెరపైకొచ్చినప్పుడు ఆ టైమ్ లో దేశంలో లేకపోయినా సెలబ్రిటీలు కొంతమంది స్పందించారు, నాగవంశీ మాత్రం తను ఇండియాలో లేనంటూ వింతగా సమాధానమిచ్చాడు.
naa chaavu nenu chastaa, pakkodi gurinchi naaku enduku ani cheptunnaadu.
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
7780683944 9381415919
vc available 9380537747
veedi geera ala undi
He said on bahlf of everyone of us in telugu states., so its their person issue , we don’t have any idea what happened between KTR and Samantha to comment on.
సినిమా థియేటర్లో రిలీజ్ అయితే మాకెందుకు, ఓటిటిలోకి వచ్చినపుడు చుస్తాంలే
సుపర్ answer.