నా నుంచి స్ఫూర్తి పొందిన వైసీపీః లోకేశ్‌

వైసీపీపై మంత్రి లోకేశ్ సెటైర్స్ విసిరారు. త‌న నుంచి వైసీపీ స్ఫూర్తి పొందింద‌ని ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెడ్‌బుక్ యాక్ష‌న్ మొద‌లైంద‌ని అన్నారు.…

వైసీపీపై మంత్రి లోకేశ్ సెటైర్స్ విసిరారు. త‌న నుంచి వైసీపీ స్ఫూర్తి పొందింద‌ని ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెడ్‌బుక్ యాక్ష‌న్ మొద‌లైంద‌ని అన్నారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేసే వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌న్నారు. కేవ‌లం చ‌ట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్‌కు మాత్ర‌మే రెడ్‌బుక్‌లో త‌మ పేరు వుందో లేదో అనే భ‌యం వుంద‌ని లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు.

వైసీపీపై యాక్ష‌న్ మాత్రం త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వైసీపీ వాళ్లు ఎలాంటి పుస్త‌కం పెట్టుకుంటారో వాళ్ల‌కే స్ప‌ష్ట‌త లేద‌న్నారు. కానీ త‌న నుంచి వాళ్లు స్ఫూర్తి పొందార‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు. ప‌రిపాల‌న ఒకే ద‌గ్గ‌ర వుండాల‌ని, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని ఆయ‌న అన్నారు. ఇది త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా లోకేశ్ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ హ‌యాంలో ఏ ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయో చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

గ‌తంలో వైసీపీ హ‌యాంలో పారిపోయిన ప‌రిశ్ర‌మ‌ల్ని తిరిగి తీసుకొస్తున్నామ‌న్నారు. ఒక‌వేళ బ్లూ బ్యాచ్ వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఇబ్బంది ఏర్ప‌డితే ఎంత‌మాత్రం ఉపేక్షించేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వ‌ర‌ద‌లొస్తే జ‌గ‌న్ మాదిరిగా ప‌ర‌దాల్ని సీఎం చంద్ర‌బాబు క‌ట్టుకుని ఇంట్లో కూచోలేద‌న్నారు.

తాము కూడా గుడ్‌బుక్ రాసుకుంటున్నామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డంపై ఆయ‌న సెటైర్ విసిరారు. రెడ్‌బుక్ రాసుకోవ‌డం పెద్ద ప‌నేమీ కాద‌ని జ‌గ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ పుస్త‌కంపై కూడా వైసీపీ నేత‌ల‌కు క్లారిటీ లేద‌ని లోకేశ్ విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ బ‌లోపేతానికి ప‌ని చేసే నాయ‌కుల గురించి గుడ్‌బుక్‌లో రాసుకుంటామ‌ని, అధికారం రాగానే ప్రాధాన్యం ఇస్తామ‌ని జ‌గ‌న్ ఇటీవల కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

11 Replies to “నా నుంచి స్ఫూర్తి పొందిన వైసీపీః లోకేశ్‌”

        1. papam burra dobbinatlu undi…92k majority, adi kuda TDP gata 40 yrs lo 1 time gelichina constitutency lo. Tandrulu taatalu gelichina constitutency lo eppudaina chusama aa majority

Comments are closed.