లండన్ బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ సినిమా

ఊహించని విధంగా తెరపైకొచ్చింది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు, ఇదొక సినిమా ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలోపే టీజర్ కూడా…

ఊహించని విధంగా తెరపైకొచ్చింది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు, ఇదొక సినిమా ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలోపే టీజర్ కూడా వదిలారు.

లండన్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా. ఇందులో నిఖిల్ పాత్ర పేరు రిషి. లోకల్ గా ఉన్నప్పుడు ఓ అమ్మాయితో ప్రేమ. ఆ తర్వాత ఎన్నారైని పెళ్లి చేసుకొని, ప్రపంచాన్ని చుట్టాలనే కోరికతో లండన్ కు షిఫ్ట్ అవ్వడం లాంటివి టీజర్ లో చూపించారు.

అయితే సినిమాలో ఈ లవ్ స్టోరీ మాత్రమే కాదు.. సస్పెన్స్, మిస్టరీ, యాక్షన్ కూడా ఉందనే విషయాన్ని టీజర్ లో కొద్దిగా చూపించారు. నిజానికి దర్శకుడు సుధీర్ వర్మ సినిమాల్లో ఇలాంటివి లేకపోతే ఆశ్చర్యపోవాలి.

టీజర్ లో నిఖిల్, రుక్మిణి వసంత్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు. మరో హీరోయిన్ దివ్యాంశతో హీరో రిలేషన్ షిప్ లో ట్విస్ట్ ఉందనే విషయాన్ని వెల్లడించారు.

సుధీర్ వర్మతో స్వామి రారా, కేశవ లాంటి సినిమాలు చేసిన నిఖిల్.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో మరో సక్సెస్ కొట్టాలనుకుంటున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 8న విడుదల చేయబోతున్నారు.

మూవీ ఎనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ ను లైట్ తీసుకున్న నిఖిల్.. ఈ సినిమా టీజర్ ను మాత్రం షేర్ చేశాడు. ప్రయోగాత్మక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా దీన్ని అభివర్ణిస్తున్నాడు.

4 Replies to “లండన్ బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ సినిమా”

Comments are closed.