రేపు మెగా క్లారిటీ వస్తుందా?

విశ్వంభర సినిమా విడుదలపై వినిపిస్తున్న డౌన్స్ అన్నీఇన్నీ కావు. చిరంజీవి చేతి గాయం కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమౌతోందని కొందరు.. గ్రాఫిక్ వర్క్ డిలే వల్ల సినిమా వాయిదా పడుతోందని మరికొందరు.. గేమ్ ఛేంజర్…

విశ్వంభర సినిమా విడుదలపై వినిపిస్తున్న డౌన్స్ అన్నీఇన్నీ కావు. చిరంజీవి చేతి గాయం కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమౌతోందని కొందరు.. గ్రాఫిక్ వర్క్ డిలే వల్ల సినిమా వాయిదా పడుతోందని మరికొందరు.. గేమ్ ఛేంజర్ కోసం చిరంజీవి తన సినిమా విడుదల తేదీని త్యాగం చేస్తున్నారని ఇంకొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ డౌట్స్ అన్నింటిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, రేపు విశ్వంభర సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల 49 నిమిషాలకు విశ్వంభర టీజర్ రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో టీజర్ ను ప్రదర్శించబోతున్నారు కూడా.

ఇప్పటివరకు ప్రతి సందర్భంలో జనవరి 10 రిలీజ్ అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. ఈ మేరకు కొన్ని పోస్టర్లు కూడా వదిలారు. ప్రెస్ నోట్స్ లో కూడా ఇదే మేటర్ చెప్పారు. కానీ తాజాగా వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో.. రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

టీజర్ లో జనవరి 10 రిలీజ్ అనే కార్డు పడిందంటే తాత్కాలికంగా ఈ ప్రచారానికి చెక్ పెట్టినట్టే. ఒకవేళ రిలీజ్ డేట్ లేకుండా టీజర్ వస్తే మాత్రం అనుమానాల్లో చాలామటుకు నిజమని నమ్మాల్సి వస్తుంది. రేపు దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకు వశిష్ఠ దర్శకుడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

4 Replies to “రేపు మెగా క్లారిటీ వస్తుందా?”

Comments are closed.