జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్

జానీ మాస్టర్ కేసు అంటేనే సంచలనాలకు కేరాఫ్. విషయం వెలుగులోకొచ్చినప్పట్నుంచి ప్రతి దశలో ఈ కేసులో సంచలనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ కేసులో కొత్త ట్విస్ట్. Advertisement జానీ మాస్టర్ పై అసిస్టెంట్ మహిళా…

జానీ మాస్టర్ కేసు అంటేనే సంచలనాలకు కేరాఫ్. విషయం వెలుగులోకొచ్చినప్పట్నుంచి ప్రతి దశలో ఈ కేసులో సంచలనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ కేసులో కొత్త ట్విస్ట్.

జానీ మాస్టర్ పై అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తను మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించడంతో మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు పడింది.

ఎవరైతే మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారో, ఇప్పుడా అమ్మాయిపై రివర్స్ కేసు పడింది. తనను సదరు మహిళా కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించిందంటూ, జానీ మాస్టర్ కు అల్లుడు వరసైన షమీర్ అనే యువకుడు ఆమెపై కేసు పెట్టాడు.

జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందని.. తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలో షూటింగ్స్ కు వెళ్లినప్పుడు ఆమె తనపై లైంగిక దాడి చేసిందని ఆరోపిస్తున్నాడు షమీర్.

ఓసారి లిఫ్ట్ లో, మరోసారి బాత్రూమ్ లో, ఇంకోసారి లాడ్జిలో.. ఈ యువకుడిపై సదరు మహిళా కొరియోగ్రాఫర్ అత్యాచారం చేసిందట. నగ్నంగా అతడి ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతోందంట. అంతేకాదు, అదంతా జరిగినప్పుడు తను మైనర్ నని అంటున్నాడు ఇతడు.

మైనర్ గా ఉన్న తనను లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు యువకుడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకున్నట్టయింది.

మొన్నటికిమొన్న జాతీయ అవార్డ్ అందుకునే విషయంలో కూడా ఊహించని ట్విస్ట్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అవార్డ్ అందుకోవం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుంటే, ఏకంగా అవార్డ్ ను రద్దు చేయడం పెద్ద షాక్. ఇప్పుడు అంతకుమించిన షాక్, ఈ కుర్రాడి రూపంలో కొత్త కేసుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..!

11 Replies to “జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్”

Comments are closed.