నేను ఏడిస్తే అందంగా ఉంటాను

“నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావ్” అనేది హీరోయిన్లకు సాధారణంగా దక్కే కాంప్లిమెంట్. చాలామంది హీరోయిన్లు మనసారా నవ్వడమే గ్లామర్ సీక్రెట్ అని కూడా చెబుతుంటారు. అనన్య పాండే మాత్రం ఈ విషయంలో రివర్స్.…

“నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావ్” అనేది హీరోయిన్లకు సాధారణంగా దక్కే కాంప్లిమెంట్. చాలామంది హీరోయిన్లు మనసారా నవ్వడమే గ్లామర్ సీక్రెట్ అని కూడా చెబుతుంటారు. అనన్య పాండే మాత్రం ఈ విషయంలో రివర్స్.

ఏడిస్తేనే తను అందంగా కనిపిస్తానని అంటోంది అనన్య పాండే. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఈ బ్యూటీ.. తనకు ఏడుపంటే చాలా ఇష్టమని ప్రకటించింది.

“నా ఇనస్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు నేను ఏడ్చే ఫొటోలు పెడుతుంటాను. కన్నీటితో నిండిన కళ్లు నాకు సహజమైన అందాన్ని, మెరుపును ఇస్తాయి. సాధారణంగా కనిపించే కంటే ఏడుస్తున్నప్పుడు నేను అందంగా ఉంటాను. ఎన్నోసార్లు ఏడుస్తూ అద్దం చూసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది.”

ఎమోషన్స్ ను తను కంట్రోల్ చేయలేనని, ఆటోమేటిగ్గా కన్నీళ్లు వచ్చేస్తాయని, అలాంటి టైమ్ లో తన అందం రెట్టింపు అవుతుందని చెబుతోంది అనన్య. ఏడిస్తే అందంగా ఉంటానని చెప్పిన ఒకేఒక్క హీరోయిన్ గా నిలిచింది ఈ బ్యూటీ.

3 Replies to “నేను ఏడిస్తే అందంగా ఉంటాను”

Comments are closed.