ఓవర్ సీస్ మార్కెట్ ఈ మధ్య కొంత వరకు బాగుంది. కంటెంట్ ఏమాత్రం బాగున్నా, సినిమాలు బాగానే అడుతున్నాయి. పెద్ద సినిమాలకు 35 డాలర్లు టికెట్ పెట్టినా, జనం హ్యాపీగా ఖర్చు చేసేస్తున్నారు. కండిషన్ ఒకటే సినిమా కాస్త బాగుండాలి.
ఇలాంటి నేపథ్యంలో ఓవర్ సీస్ మార్కెట్ మీద బయ్యర్ల కన్ను మళ్లీ పడింది. సినిమాలు కొంటాం.. సినిమాలు.. అన్నట్లుగా హైదరాబాద్ లో మకాం వేసి మరీ తిరుగుతున్నారు.
నాని- దసరా డైరక్టర్ సినిమా, ప్రభాస్- హను రాఘవపూడి, ప్రభాస్- మారుతి సినిమా, సుధాకర్ చెరుకూరి- దుల్కర్ సల్మన్ సినిమా ఇలా ఓ అరడజను సినిమాల వరకు బేరాలకు రెడీగా వున్న సినిమాలు వున్నాయి ఇండస్ట్రీలో. వీటి మీద బేర సారాలు సాగుతున్నాయి. అయితే నిర్మాతలు కోట్ చేస్తున్న రేట్లు కూడా అలాగే వున్నాయి. ఎప్పుడైతే బేరాలు వస్తున్నాయో, రేట్లు కూడా అలాగే వుంటాయి కదా.
ప్రభాస్ కల్కి అద్భుతంగా పే చేసింది ఓవర్ సీస్ లో, అలాగే దేవర కూడా, అందుకే ప్రభాస్- హను రాఘవపూడి సినిమా ఓవర్ సీస్ రైట్స్ ఒక్కటే 80 నుంచి 100 కోట్ల రేంజ్‌లో కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేటు విని దుబాయి నుంచి సినిమాల కోసం వచ్చిన వాళ్లు కళ్లు తేలేసినిట్లు తెలుస్తోంది. రేట్లు ఒకటే కాదు, ముందుగా పేమెంట్ మొత్తం ఇవ్వాలంటే వడ్డీలు కూడా లెక్కేసుకోవాల్సి వుంటుంది కదా. అదీ సంగతి.
Call boy works 9989793850
vc estanu 9380537747
PRABHAS MOVIE NIJAM GA OKKATINA REAL HIT AYYINDAA .movies emina bagunnayaa
ఎందుకూ… ఎలాగూ థియేటర్లో చూడం