బిష్ణోయ్ గ్యాంగ్ భ‌యాన‌కం.. స‌ల్మానే అస‌లు ల‌క్ష్యం?

కెన‌డా వేదిక‌గా ఇండియాలో దురాగ‌తాల‌కు తెగ‌బ‌డ‌గ‌ల‌మ‌ని నిరూపించుకుంటోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. మ‌హారాష్ట్ర పొలిటీషియ‌న్ బాబా సిద్ధిఖ్ హ‌త్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో.. ఈ గ్యాంగ్ అస‌లు టార్గెట్…

కెన‌డా వేదిక‌గా ఇండియాలో దురాగ‌తాల‌కు తెగ‌బ‌డ‌గ‌ల‌మ‌ని నిరూపించుకుంటోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. మ‌హారాష్ట్ర పొలిటీషియ‌న్ బాబా సిద్ధిఖ్ హ‌త్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో.. ఈ గ్యాంగ్ అస‌లు టార్గెట్ స‌ల్మాన్ ఖాన్ అనే విష‌యం మ‌రోసారి తెరపైకి వ‌చ్చింది. కృష్ణ జింక‌ల వేటాడిన కేసుల‌ను ఎదుర్కొన్నాడు స‌ల్మాన్ ఖాన్.

బ‌హుశా హ‌మ్ సాథ్ సాథ్ హై అనే సినిమా షూటింగ్ స‌మ‌యంలో కాబోలు స‌ల్మాన్ ఖాన్ తో స‌హా ఆ సినిమాలో న‌టించిన న‌టీన‌టులు ఆ కేసుల‌ను ఎదుర్కొన్నారు. వారిని లీడ్ చేసింది స‌ల్మాన్ అనే ఆరోప‌ణ‌లున్నాయి. అయితే చ‌ట్ట‌ప‌రంగా ఆ కేసులు వీగిపోయిన‌ట్టుగా ఉన్నాయి. చాలా కాల‌మే విచార‌ణ జ‌రిగినా.. నిరూపితం కాలేదు. అయితే బిష్ణోయ్ తెగ‌వారు ఆ కేసుల‌ను పై కోర్టుల్లో కొన‌సాగించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లూ ఉన్నాయి.

అయితే చ‌ట్ట‌ప‌రంగా పోరాటాన్ని ఎవ‌రైనా స‌మ‌ర్థిస్తారు కానీ, ఉనికి చాటుకునే హ‌త్య‌లు ఏ మాత్ర‌మూ స‌మ‌ర్థ‌నీయం కాదు. బాబా సిద్ధిఖ్ హ‌త్య వెనుక కార‌ణం కూడా స‌ల్మాన్ తో అత‌డికి ఉన్న సాన్నిహిత్య‌మే అనే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి. సిద్ధిక్ మాజీ ఎమ్మెల్యే, ఆయ‌న త‌న‌యుడు ప్ర‌స్తుతం ఎమ్మెల్యే గా ఉన్నాడు. ఎన్సీపీలో చీలిక వ‌ర్గంలో చేరాడు కాంగ్రెస్ నుంచి వెళ్లి. అజిత్ ప‌వార్ వ‌ర్గంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వైపు ఉన్నాడు. ఇలా అధికార కూట‌మి కి సంబంధించిన నేత ను కాల్చి చంప‌డంతో ప్ర‌భుత్వం కూడా ఇర‌కాటంలో ప‌డింది. ఇలా య‌ధేచ్ఛ‌గా కాల్చేసి వెళ్లిపోయేంత ఈజీగా ఉందా.. భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తున్నాయి.

అది కూడా ఎక్క‌డో విదేశాల్లోని మాఫియాకు ఇండియాలో ఇంత శ‌క్తా.. అనే ప్ర‌శ్న కేంద్ర ప్ర‌భుత్వం కూడా స్పందించేలా చేస్తోంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అస‌లు టార్గెట్ స‌ల్మాన్ ఖాన్ అని, అందుకే అత‌డి స‌న్నిహితుడిని కాల్చి చంపి స‌ల్మాన్ ను భ‌యంలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి.

గ‌తంలో స‌ల్మాన్- షారూక్ మ‌ధ్య‌న కోల్డ్ వార్ జ‌రుగుతోంద‌నే త‌రుణంలో త‌న ఇంట్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి వారిద్ద‌రికీ రాజీ చేశాడ‌ట ఈ బాబా సిద్ధిఖ్. ఇలా బాలీవుడ్ ఖాన్ ల‌తో ఇత‌డికి అంత సాన్నిహిత్యం ఉంద‌ని తెలుస్తోంది. బాబా సిద్ధిఖ్ హ‌త్య‌ద్వారా స‌ల్మాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చ‌రిక‌లు పంపింద‌నే మాట గ‌ట్టిగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ ఇంటి వ‌ద్ధ భ‌ద్ర‌త‌ను కూడా క‌ట్టుదిట్టం చేశారు. త‌న ఇంటికి విజిట‌ర్స్ ను రానివ్వొద్ద‌ని స‌ల్మాన్ కు పోలీసులు చెప్పిన‌ట్టుగా స‌మాచారం. అలాగే స‌ల్మాన్ ఇంటి వ‌ద్ద సెల్ఫీల‌కు అంటూ, చూడ‌టానికి అంటూ ఎవ‌రినీ ఆగ‌నివ్వ‌కుండా కూడా ఏర్పాట్లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

3 Replies to “బిష్ణోయ్ గ్యాంగ్ భ‌యాన‌కం.. స‌ల్మానే అస‌లు ల‌క్ష్యం?”

Comments are closed.