నవంబర్ 20 న జరగబోతున్నాయి మహారాష్ట్ర ఎన్నికలు. ఆ తర్వాతి మూడు రోజులకు ఫలితాలు వెల్లడి అవుతాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాల విషయంలో చర్చ పతాక స్థాయికి చేరుతూ ఉంది. ప్రత్యేకించి అధికారంలో ఉన్న కూటమి సీఎం అభ్యర్థిత్వం విషయంలో ప్రత్యర్థి కూటమికి సవాల్ విసరడం గమనార్హం. తమ సీఎం అభ్యర్థి కూర్చునే ఉన్నాడని, తమ ప్రత్యర్థుల సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ .. శరద్ పవార్ కు సవాల్ విసిరారు.
మహాఘట్ బంధన్ సీఎం క్యాండిడేట్ ఎవరో ప్రకటిచాలంటూ ఈ బీజేపీ నేత సవాల్ విసిరాడు. తమ సీఎం అభ్యర్థి కూర్చునే ఉన్నాడంటూ షిండేను ఉద్దేశించి ఫడ్నవీస్ ప్రకటించడం ద్వారా.. ఆయనే తమ కూటమి అభ్యర్థి అని ప్రకటించేసినట్టుగా ఉంది.
స్వయంగా ఫడ్నవీస్ ఈ ప్రకటన చేయడంతో.. బీజేపీ- శివసేన-ఎన్సీపీల కూటమి సీఎం క్యాండిడేట్ షిండేనే అని స్పష్టం చేసినట్టుగా అయ్యింది. శివసేనను చీల్చి షిండేను సీఎంగా చేసింది బీజేపీ. అది తాత్కాలికం కాదని, ఎన్నికలకు కూడా మరో ముఖాన్ని తీసుకురావడం లేదని ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చేసినట్టే. సీఎం అభ్యర్థి షిండేనే అని స్పష్టం చేశారు ఈ కమలనాథుడు. మరి షిండే ఇమేజ్ కూటమికి ఏ మేరకు గెలుపును తెస్తుందో చూడాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల సమయంలో.. ఈ కూటమి కలిసి పోటీ చేయగా, బీజేపీ కన్నా షిండే నాయకత్వంలో శివసేన స్ట్రైక్ రేట్ మెరుగ్గా ఉంది. అలాగే బీజేపీ నేతే సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకునే ధైర్యం కూడా కమలం పార్టీ చేసినట్టుగా లేదు. అజిత్ పవార్ కు అంత సీన్ లేదని లోక్ సభ ఎన్నికలతో రుజువు అయ్యింది. దీంతో షిండే మినహా గత్యంతరం కనిపించినట్టుగా లేదు. అయితే దీన్ని ఉత్సాహవంతంగా మారుస్తూ.. తమ సీఎం క్యాండిడేట్ సిట్టింగ్ సీఎం అని, ప్రత్యర్థి కూటమి సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఇరు కూటముల్లోనూ సీట్ల చర్చ గట్టిగా సాగుతున్నట్టుగా ఉంది.
షిండే సేన స్ట్రైక్ రేట్ ఎందుకు బాగుంది అంటే షిండే సేన పన్నెండు సీట్ల లో ఉద్దవ్ సేన తో తలపడి ఆరు సీట్లు గెలిచి ఆరు సీట్లు ఓడింది. కాంగ్రెస్ మీద పోటీ చేసిన రెండు సీట్లు ఓడిపోయింది. బీజేపీ ఉద్దవ్ సేన తో పోటీ చేసిన నాలుగు సీట్ల లో మూడు గెలిచి ఒకటి ఓడింది.
బీజేపీ కాంగ్రెస్ తో పోటీ చేసిన 15 లో 11 ఓడింది, శరద్ పవార్ పార్టీ తో పోటీ చేసిన 8 లో 6 ఓడింది. ప్రతిపక్ష కూటమి లో ఉద్దవ్ సేన కొంచం వీక్!
కాని అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష కూటమి పప్పులు ఉడకవు, లోకసభ ఎన్నికలు లో గారంటీ పేరు తో చేసిన మోసం ప్రజలు గుర్తించారు!