త్రివిక్రమ్ కు ఆమె.. బోయపాటికి ఈమె!

ఒక్కసారి ఆలోచనలు సింక్ అయ్యాయంటే, ఇండస్ట్రీలో ఇక ఆ కాంబినేషన్ ను ఎవ్వరూ విడదీయలేరు. ఈ విషయంలో హీరోహీరోయిన్లు, హీరోదర్శకులు మాత్రమే కాదు.. దర్శకులు-హీరోయిన్లు కూడా ఉంటారు. Advertisement ఉదాహరణకు త్రివిక్రమ్ నే తీసుకుంటే,…

ఒక్కసారి ఆలోచనలు సింక్ అయ్యాయంటే, ఇండస్ట్రీలో ఇక ఆ కాంబినేషన్ ను ఎవ్వరూ విడదీయలేరు. ఈ విషయంలో హీరోహీరోయిన్లు, హీరోదర్శకులు మాత్రమే కాదు.. దర్శకులు-హీరోయిన్లు కూడా ఉంటారు.

ఉదాహరణకు త్రివిక్రమ్ నే తీసుకుంటే, ఒక టైమ్ లో సమంత లేని త్రివిక్రమ్ సినిమాను ఊహించుకోవడమే కష్టమైంది. ఏ ముహూర్తాన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో వీళ్లు కలిశారో కానీ, అప్పట్నుంచి త్రివిక్రమ్ ను నిజంగానే మాయచేసింది సమంత.

అత్తారింటికి దారేది సక్సెస్ తో సమంతను సెంటిమెంట్ గా ఫీలయ్యారు త్రివిక్రమ్. ఆ తర్వాత తను తీసిన సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాల్లో కూడా ఆమెనే తీసుకున్నారు.

రీసెంట్ గా సమంతకు గ్యాప్ ఇచ్చారు. సమంత చేయదేమో అనే భయంతో ఆమె కోసం పాత్రలు రాయడం లేదన్నారు. అలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా రాయండి అంటూ సమంత సైగ చేయడం కొన్ని రోజుల కిందట వైరల్ అయింది. సో.. రాబోయే రోజుల్లో కచ్చితంగా వీళ్లిద్దరూ కలుస్తారు.

అలాంటిదే మరో కాంబినేషన్ బోయపాటి-ప్రగ్యా జైశ్వాల్. వీళ్ల అనుబంధం కూడా గట్టిగా పెనవేసుకుంటోంది. జయజానకి నాయకాలో ఓ చిన్న రోల్ పోషించింది ప్రగ్యా. ఆ తర్వాత అఖండలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఆఫర్ చేశాడు బోయపాటి.

ఇప్పుడు అఖండ-2లో కూడా ఆమెనే రిపీట్ చేశాడు. అఖండలో ప్రగ్యా పోషించిన పాత్ర పార్ట్-2లో కూడా కొనసాగబోతోందన్నమాట. ఇలా త్రివిక్రమ్ టైపులో, బోయపాటి కూడా హీరోయిన్ ను రిపీట్ చేస్తున్నాడు.

11 Replies to “త్రివిక్రమ్ కు ఆమె.. బోయపాటికి ఈమె!”

  1. Wrong. When boyapati said will go with different heroine in Akhanda-2, it’s Balakrishna said go only with Pragya Jaiswal.

    Great Andhra, You please try to check and collect the facts and post the correct information. Don’t post false assumptions. Your reputation will go down.

Comments are closed.