వైసీపీ నూత‌న కోఆర్డినేట‌ర్లు వీరే!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం అనంత‌రం పార్టీ పున‌ర్నిర్మాణంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దృష్టి సారించారు. ఇప్ప‌టికే వైసీపీ జిల్లా అధ్య‌క్షుల నియామకాల్ని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ కోసం నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసే…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం అనంత‌రం పార్టీ పున‌ర్నిర్మాణంపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దృష్టి సారించారు. ఇప్ప‌టికే వైసీపీ జిల్లా అధ్య‌క్షుల నియామకాల్ని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ కోసం నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసే వాళ్ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నియ‌మించ‌డానికి ఆయ‌న ఆస‌క్తి చూపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ కోఆర్డినేట‌ర్ల నియామ‌కంపై బుధ‌వారం ఉద‌యం నుంచి సీనియ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం కోఆర్డినేట‌ర్లుగా ఎవ‌రిని నియ‌మించాల‌నే విష‌య‌మై జ‌గ‌న్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. వైసీపీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు వైసీపీ నూత‌న కోఆర్డినేట‌ర్లుగా ఎంపికైన నాయ‌కుల వివ‌రాలివే.

ఉమ్మ‌డి గుంటూరు, ప్రకాశం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా రాజంపేట‌ ఎంపీ మిధున్‌రెడ్డి, క‌ర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కృష్ణా జిల్లాకు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, ఉభ‌య గోదావ‌రి జిల్లాల కోఆర్డినేట‌ర్‌గా మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఉత్త‌రాంధ్రకు విజ‌య‌సాయిరెడ్డిని, క‌డ‌ప‌-అనంత‌పురం జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.

ఇదిలా వుండ‌గా వీటిలో కొన్నింటిపై సీనియ‌ర్ నేత‌లు అభ్యంత‌రం చెప్ప‌డంతో అధికారిక ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డిన‌ట్టు తెలిసింది. అభ్యంత‌రంపై వైఎస్ జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గుతారా? లేక తాను అనుకున్న మేర‌కు ముందుకెళుతారా? అనేది తెలియాల్సి వుంది.

26 Replies to “వైసీపీ నూత‌న కోఆర్డినేట‌ర్లు వీరే!”

  1. పెద్ది రెడ్డి, చిన్ని రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి..

    అంతా రెడ్ల మయం.. ఈ పార్టీ అంతా రెడ్ల మయం ..

    సాక్షి లో ప్రచారానికి మాత్రం.. బీసీ ల పార్టీ మా జగన్ పార్టీ..

    చిడత.. చిడత.. చిడత..

  2. అంతా రెడ్ల మయం.. ఈ పార్టీ అంతా రెడ్ల మయం ..

    సాక్షి లో ప్రచారానికి మాత్రం.. బీసీ ల పార్టీ మా జగన్ పార్టీ..

  3. పెద్ది రెడ్డి, చిన్ని రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి..

    అంతా రెడ్డోళ్ళ మయం.. ఈ పార్టీ అంతా రెడ్డోళ్ళ మయం ..

    సాక్షి లో ప్రచారానికి మాత్రం.. బీసీ ల పార్టీ మా జగన్ పార్టీ..

    చిడత.. చిడత.. చిడత..

  4. చూసావా G A?? ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎన్నో పాఠాలు నేర్పావు జగనన్న కి… ఏమీ లాభం లేదు…

  5. సందట్లో సడేమియా లా నువ్వు కూడా నైజాం రైట్స్ తీసుకోవాల్సింది GA..😂😂

    1. ఫాఫామ్ ఆయన బాధ కూడా అదే ఎదో సినిమా పాట లో చెప్పినట్టు “పనికి మాలిన వెధవలికి ఇచ్చి నాకు ఎందుకు ఈయవు పిలిచి ” అని

  6. తోటి రెడ్డి తోక లకి పార్టీ పదవులు అనేసరికి రెడ్డి వెబ్సైట్ వెనకటి రెడ్డి కి వొంటి మీద బట్ట నిలవడం లేదు.

  7. పాత సారా ఐన కొత్త సీసా లో వెయ్యాలి కదా … ఏదయినా మన అన్న వ్యూహం అదుర్స్ …ఈ సారి కూడా వై నాట్ 175 ….మేము సిద్ధం ….

  8. పాత సారా ఐన కొత్త సీసా లో వెయ్యాలి కదా … ఏదయినా మన అన్న వ్యూహం అదుర్స్

Comments are closed.