విజ‌య‌సాయి ఎంపిక‌పై బొత్స వ్య‌తిరేక‌త‌!

ఉత్త‌రాంధ్ర వైసీపీ కోఆర్డినేట‌ర్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నియామ‌కాన్ని ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్య‌తిరేకిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వైసీపీ కోఆర్డినేట‌ర్ల నియామ‌కంపై సీనియ‌ర్ నేత‌ల‌తో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం కీల‌క…

ఉత్త‌రాంధ్ర వైసీపీ కోఆర్డినేట‌ర్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి నియామ‌కాన్ని ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్య‌తిరేకిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వైసీపీ కోఆర్డినేట‌ర్ల నియామ‌కంపై సీనియ‌ర్ నేత‌ల‌తో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం కీల‌క స‌మావేశం నిర్వ‌హించార‌ని తెలిసింది.

ఈ సంద‌ర్భంగా ఉత్త‌రాంధ్ర కోఆర్డినేట‌ర్‌గా విజ‌య‌సాయిరెడ్డిని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని స‌మావేశానికి హాజ‌రు కాని, ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ పెద్ద దిక్కు అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్లు తెలియ‌జేశార‌ని తెలిసింది. దీంతో బొత్స ఏ మాత్రం అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో విజ‌య‌సాయిరెడ్డిని ఉత్త‌రాంధ్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు.

అయితే ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌ను స‌ర్ది చెప్పడానికి బ‌దులు, మ‌రింత‌గా పెరిగేలా విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ వుంది. అలాగే విశాఖ‌లో భూదందాలకు విజ‌య‌సాయిరెడ్డి పాల్ప‌డ్డార‌ని కూట‌మి నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు, ఉత్త‌రాంధ్ర‌లో పెద్ద మ‌నిషిగా గౌర‌వించే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అశోక్‌గ‌జ‌ప‌తిరాజును విజ‌య‌సాయిరెడ్డి అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఆ ప్రాంత‌వాసుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

ముఖ్యంగా మాన్సాన్ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా అశోక్‌గ‌జ‌ప‌తిరాజును తొల‌గించి, ఆయ‌న అన్న కుమార్తె సంచైత గ‌జ‌ప‌తిరాజును నియ‌మించడాన్ని ఉత్తరాంధ్ర స‌మాజం జీర్ణించుకోలేక‌పోయింది. త‌మ‌కు రాజ‌కీయంగా గిట్ట‌ని నాయ‌కుడ‌ని అశోక్‌గ‌జ‌ప‌తిరాజు లాంటి నాయ‌కుడిని కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ముప్పుతిప్ప‌లు పెట్టార‌ని, ఇందుకు విజ‌య‌సాయిరెడ్డే కార‌ణ‌మ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ గుర్తు పెట్టుకున్నార‌ని ప‌లువురు చెబుతున్నారు.

దీంతో విజ‌య‌సాయిరెడ్డిని నాడు కోఆర్డినేట‌ర్‌గా త‌ప్పించి, వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అయితే అప్ప‌టికే వైసీపీకి విజ‌య‌సాయిరెడ్డి కార‌ణంగా విప‌రీత‌మైన న‌ష్టం క‌లిగింది. చేత‌లు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందమైంది వైసీపీకి. ఆ త‌ర్వాత బాధ్య‌త‌లు తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి కూడా పార్టీని గ‌ట్టెక్కించ‌లేక‌పోయారు. వైవీ కుమారుడు ఉత్త‌రాంధ్ర‌లో మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఉత్త‌రాంధ్ర వైసీపీకి కావాల్సింది… రెడ్డి నాయ‌క‌త్వం కాదు. బ‌ల‌మైన బీసీ నాయ‌కుడు. వైసీపీకి వెనుబ‌డిన వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన నాయ‌కుడే దొర‌క‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

10 Replies to “విజ‌య‌సాయి ఎంపిక‌పై బొత్స వ్య‌తిరేక‌త‌!”

  1. ఇంత కాలం ” గ్రేట్ ఆంధ్ర ” జగనన్న కి నేర్పిన పాఠా లన్నీ శుద్ధ దండగ…

  2. ఆ పార్టీ లో మిగిలింది ముగ్గురు.. అందులో ఇద్దరు కొట్టుకుని ఛస్తున్నారు ..

    అయినా బొత్స గాడు ఎమ్మెల్సీ అయ్యాక .. పార్టీ గోడ దూకడానికి సమయం కోసం వెయిటింగ్.. మీరే అవకాశం ఇచ్చేలా ఉన్నారు..

    ఈ బొక్కలో పార్టీ మళ్ళీ గెలుస్తుందనే ఆశలున్నాయంట..

    వాడేమో బెంగుళూరు లో దాక్కున్నాడు.. ఇక్కడేమో ఉన్నోళ్లు ఎక్కడున్నారో తెలీదు..

    క్యాడర్ గాలికి.. పార్టీ గోదాట్లోకి.. ఇక్కడ కామెంట్స్ రాసే నీలినక్కలు అడవుల్లోకి..

    1. ఆల్రెడీ బొత్స చెంచాలు జనసేన లోకి వెళ్లేదానికి ట్రై చేస్తున్నారు…. ఏవో మొహమాటలు ఉన్నట్టు ఉన్నాయ్ … విజయనగరం వరకు విజయనగరం మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ లు ఇద్దరు కొంచం అజాత శత్రువు టైపు గట్టిగ చెప్పలేరు… రావద్దు అని ఎటు నుండి ఎటు అయినా పైగా సామజిక వర్గం… బంధుత్వాలు ఇంకా వ్యాపార సంబంధాలు

Comments are closed.