3 రోజులుగా ఒకటే టెన్షన్. విమానంలో బాంబ్ అంటూ వరుస బెదిరింపులు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 విమానాలకు బాంబ్ బెదిరింపులు.. అధికారులు ఉరుకులు పరుగులు.. విమానాల దారి మళ్లింపు.. గంటల పాటు ఆలస్యం.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసిన ప్రయాణికులు.. కోట్ల రూపాయల నష్టం.
ఇలా 3 రోజులుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బాంబ్ బెదిరింపు కేసుల్లో కొంత పురోగతి సాధించారు పోలీసులు. అన్నీ కాకపోయినా, ముఖ్యమైన 3 విమానాలకు సంబంధించిన బెదిరింపుల్లో ఓ 17 ఏళ్ల టీనేజర్ హస్తం ఉన్నట్టు పసిగట్టారు.
ఛత్తీస్ గడ్ లోని రాజనందగావ్ లో ఉన్న ఓ వ్యాపారవేత్త, అతడి 17 ఏళ్ల కొడుకు ఈ పని చేసినట్టు గుర్తించిన పోలీసులు, వాళ్లకు నోటీసులిచ్చారు. ముంబయి-న్యూయార్క్ ఎయిరిండియా విమానం.. ముంబయి నుంచి మస్కట్, జెడ్డా వెళ్లే ఇండిగో విమానాలకు ఈ మైనర్ బాలుడే బాంబ్ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో సాంకేతిక ఆధారాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ టీనేజర్ ఎందుకు ఆ పనిచేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుర్రాడు కేవలం 3 విమానాలకే బాంబు బెదిరింపు పోస్టులు పెట్టాడా లేక మిగతా విమానాలకు సంబంధించిన బెదిరింపులకు పాల్పడింది కూడా ఇతడేనా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
మొత్తానికి 3 రోజులుగా అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు ఓ మోస్తరుగా కొలిక్కి వచ్చింది. మైనర్ అని చూడకుండా అతడికి కఠిన శిక్ష విధించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.
vc available 9380537747
Call boy works 9989793850