మూసీ , చెరువులే కాదు …అంతకు మించి!

హైదరాబాదులో అక్రమ నిర్మాణదారుల, కబ్జాదారుల గుండెల్లో కొంత కాలం రైళ్లు పరుగెత్తించిన, గంగవెర్రులెత్తించిన, సింహ స్వప్నంలా మారిన “హైడ్రా” కొన్ని రోజులుగా నిదానించింది. ఇందుకు కారణం…వెనుకా ముందు ఆలోచించకుండా నిర్మాణాలను, ఇళ్లను కూల్చేస్తున్నారని హైకోర్ట్…

హైదరాబాదులో అక్రమ నిర్మాణదారుల, కబ్జాదారుల గుండెల్లో కొంత కాలం రైళ్లు పరుగెత్తించిన, గంగవెర్రులెత్తించిన, సింహ స్వప్నంలా మారిన “హైడ్రా” కొన్ని రోజులుగా నిదానించింది. ఇందుకు కారణం…వెనుకా ముందు ఆలోచించకుండా నిర్మాణాలను, ఇళ్లను కూల్చేస్తున్నారని హైకోర్ట్ మండిపడి అక్షింతలు వేయడం, దసరా పండుగ రావడం, ఈ సందర్భంగా నగర జనం చాలా రోజులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడం.. దీంతో హైడ్రా కామ్ అయిపొయింది.

కానీ తాజాగా ప్రభుత్వం హైడ్రా అధికారాలను, దాని విధుల పరిధిని పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో అది మరింత బలోపేతం అయింది. అందులోనూ ఈ ఉత్తర్వుల కారణంగా న్యాయపరమైన చిక్కులు ఉండవని ప్రభుత్వం చెప్పింది. జీహెచ్ ఎంసి అండ్ మున్సిపల్ అధికారాలను కూడా హైడ్రాకు బదిలీ చేశారు.

ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ మీద గవర్నర్ ఆల్రెడీ సంతకం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చట్టం అవుతుంది. ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలు మూసీ పరీవాహక ప్రాంతంలో, చెరువులు ఆక్రమించి చేసిన నిర్మాణాలకే పరిమితమైంది. కానీ ఇకనుంచి రోడ్లు, నాలాలు, వీధులు, జలవనరులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు, ఇతరత్రా ఆక్రమణలకు కూడా విస్తరించింది.

ఇందుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, బాధ్యుల నుంచి పత్రాలు కోరడం, ఆక్రమణ నిజమని తేలాక నిర్మాణాలను కూల్చడం, విపత్తులు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవడం వంటి అధికారాలన్నీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నుంచి నేరుగా హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో హైడ్రాకు అదనపు బలం సమకూరినట్లయింది.

క్రీడా మైదానాలను సంరక్షించడం కూడా హైడ్రానే చూసుకుంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, ట్రాఫిక్‌ సమన్వయం, అగ్నిమాపక సేవలు మొదలైనవి కూడా హైడ్రా పరిధిలోకే వస్తాయి. కొన్ని భారీ భవనాలకు ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఉండదు. అలాంటి భవనాలకు నోటీసులు ఇవ్వడం, వినకపోతే కూలగొట్టడం కూడా చేస్తుంది.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ నిర్మాణాలు కూలుస్తామంటూ కేవలం రంకెలు వేసి ఊరుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టాడు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాలను కూలుస్తామన్న గులాబీ పార్టీయే ఇప్పడు హైడ్రాను తీవ్రంగా వ్యతిరేస్తోంది. ఈ ఓవరాక్షన్ అంతా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం కోసమే.

4 Replies to “మూసీ , చెరువులే కాదు …అంతకు మించి!”

  1. Hydra….పాత బస్తీలో అక్రమ నిర్మాణాలు fatima college కూల్చే దమ్ము ఉందా… నీ ప్రతాపం ఐక్యత లేని హిందువుల పై కాదు …పందుల పై చూపించి నీ dedication prove చేస్కో

  2. Fire safety ante mottham old city koolagottali. next aa pani chesthara. pani kocche pani cheyandi raa luchas. GHMC vundamga mallee HYDRA endi veella bondha.

Comments are closed.