మాతృత్వ దశలోకి మరో హీరోయిన్ ప్రవేశించబోతోంది. పెళ్లయిన 12 ఏళ్లకు హీరోయిన్ రాధికా ఆప్టే గర్భం దాల్చింది. నిజానికి ఆమె గర్భవతి అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఓ ఈవెంట్ కు హాజరైన రాధికాను చూసిన తర్వాత అందరికీ తెలిసొచ్చింది.
లండన్ ఫిలింఫెస్టివల్ లో ఆమె నటించిన సిస్టర్ మిడ్ నైట్ సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కు రాధిక హాజరైంది. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం అప్పుడే లోకానికి తెలిసింది.
రాధికా ఆప్టే, బ్రిటిష్ మ్యూజీషియన్ బెనడిక్ట్ టేలర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఏడాది లండన్ లో వీళ్లు కలుసుకున్నారు. కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. 2013లో వీళ్లు తమ పెళ్లి మేటర్ ను బయటపెట్టారు.
బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు రాధిక ఆప్టే. ఎన్నో భాషల్లో సినిమా చేసిందామె. పలు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కూడా నటించింది. తెలుగులో కూడా లెజెండ్ లాంటి సినిమాలు చేసింది. ఓ సౌత్ హీరోపై గతంలో ఆమె కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసింది. 39 ఏళ్ల రాధిక ఆప్టే త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది.
Good
“C ” mantham cheyamantavaa yemiti ippudu…??
12 ఏళ్ళకి అంటే..! విత్తనం మొగుడిదేనా??