అది కేంద్రం సాయమా? రాష్ట్రం చేస్తున్న అప్పా?

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేయడం! ఏపీలో- కేంద్రంలో ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే రాజ్యమేలుతున్నాయి కాబట్టి.. ఏపీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని అంతా అనుకున్నారు.…

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేయడం! ఏపీలో- కేంద్రంలో ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే రాజ్యమేలుతున్నాయి కాబట్టి.. ఏపీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని అంతా అనుకున్నారు. అందరూ అలా అనుకునేలా.. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు నుంచి ఊదరగొట్టాయి. గెలిచిన తర్వాత కూడా ఏపీ ప్రగతి దిశగా పరుగులు పెట్టబోతున్నదంటూ చాలా చాలా మాటలు చెప్పారు.

అయితే.. నిజంగానే ఏపీ అభివృద్ధికి కేంద్రం పెద్ద మనసుతో అదనంగా చేయూత అందించబోతున్నదా? లేదా, తమ తమ స్వప్రయోజనాలకోసం చేయని సాయానికి కూడా కేంద్రాన్ని కీర్తిస్తూ.. రాష్ట్రాన్ని నెమ్మదిగా దారుణమైన అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం అందించే సహకారం.. నిధుల విడుదలకు సంబంధించి గతంలో కేంద్రం చేసిన ప్రకటనలు, ఇప్పుడు సీఆర్డీఏ అథారిటీతో నిర్వహించిన సమావేశం తరువాత మంత్రి నారాయణ చేస్తున్న ప్రకటనలు గమనిస్తే ఇలాంటి భయం కలుగుతోంది.

డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత.. తొలిబడ్జెట్ లోనే కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత అదే రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ సొమ్ములకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. ఆ 15 వేల కోట్లు ప్రపంచబ్యాంకు, ఏడీబీఐ నుంచి కేంద్రమే రుణంగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి అందిస్తుందని ఆమె వివరించారు. ఆ డబ్బులు రుణమే గానీ.. ఆ రుణాన్ని కేంద్రం తీరుస్తుందని, ఏపీ ప్రభుత్వం తీర్చవలసిన అవసరం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

తీరా ఇప్పుడు మంత్రి నారాయణ సీఆర్డీయే అధికార్లతో నిర్వహించిన సమావేశం తరువాత విలేకరుల సమావేశంలో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రపంచబ్యాంకు ఏడీబీఐ లనుంచి రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల రుణ స్వీకరణ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపినట్లుగా ఆయన చెబుతున్నారు.

ఇప్పుడు వీళ్లు రుణం తీసుకోడానికి ఓకే అన్నారు గనుక.. నవంబరు, డిసెంబరు నెలల్లో ఆ డబ్బులు విడుదల అవుతాయని కూడా అంటున్నారు. ఆయన మాటలను గమనిస్తే సీఆర్డీయేనే రుణం తీసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. అదే నిజమైతే అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఏం సాయం చేసినట్టు?

తాము రుణం తీసుకుని ఏపీకి ఇస్తామని, ఏపీ తిరిగి తీర్చాల్సిన అవసరం లేదని ఆరోజు ఆర్థిక మంత్రి చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఈ రుణభారం ఏపీ సర్కారు మీదనే పడేట్లయితే గనుక.. ఈ వైఫల్యాన్ని చంద్రబాబు చేతగానితనంగా చూడాలా లేదా? అనే సందేహం ప్రజల్లో ఉంది. అసలు ఈ రుణం విషయంలో ఎవరు ఇస్తున్నారనేది, ఏ అవసరం కోసం ఇస్తున్నారనేది క్లారిటీ ఉంది. కానీ.. ఎవరు తీర్చాలి అనే విషయంలో క్లారిటీలేకుండా పోతోంది.

17 Replies to “అది కేంద్రం సాయమా? రాష్ట్రం చేస్తున్న అప్పా?”

  1. ఒకవేళ అప్పే అనుకుందాం, అభివృద్ధి కోసం అప్పు చేయడం లో తప్పేముంది. పంచడానికి అప్పు చేస్తే తప్పు.

  2. నారాయణ అన్నది తమరికి అర్ధం కాలేదు. పోనీ నువ్వు అన్నట్లు నారాయణ అన్నదే అనుకో, దేశ ఆర్థిక మంత్రి బడ్జెట్ లో పెట్టింది ఎక్కువ విలువ, రాష్ట్ర మంత్రి ప్రెస్ మీట్ లో చెప్పిందా?

  3. బోరుగడ్డ అనిల్ కోసం ఒక సంతాప ఆర్టికల్ రాయొచ్చు కదా..

    అధికారం లో ఉంటె.. చెడుగుడు ఆడాడు … మొడ్డగుడిసాడు .. అంటూ ఆర్టికల్స్ రాసేటోడివి..

    అధికారం పోగానే.. పాపం.. జైలు పాలు చేసేసి.. ఇంట్లో ఆడోళ్ళ చేత సంతాప వీడియోలు పెట్టిస్తున్నావు..

    ఇంతకీ.. నీ జగన్ రెడ్డి బోరుగడ్డ ని విసిటింగ్ కోసం బెంగుళూరు నుండి వస్తున్నాడా..?

    జగన్ రెడ్డి ని బొక్కలో వేయడం కన్నా.. ఇలా విసిటింగ్ అంటూ రోజూ జైలు చుట్టూ తిప్పడం బెటర్ అనిపిస్తోంది..

  4. పై నుండి నిధులు వస్తాయన్న ఆశ ఎప్పుడూ పెట్టుకోకండి, వాస్తవం లో‌ జీవించండి. మనం డైరెక్ట్ గా బీజేపీ నే రాష్ట్రంలో గెలిపించినా మనకేమీ విదిలించరు, కావాలంటే అలా గెలిపించిన కర్ణాటక, మహారాష్ట్రాలని అడిగిచూడండి.

  5. అలా 15 వేల కోట్లు సాయం ప్రకటించగానే ఇలా 12 వేల కోట్లతో iconic buildings అంటూ ప్రకటనలిస్తే అంతే ఉంటుంది. జుట్టు చెరిపేసుకొని, చొక్కాలు నలిపేసుకొని దీనగా మొహాలు పెడితే ఓ 150 కోట్లు గీచి ఇస్తుంది కరోడా లేడీ.

  6. అలా 15 వేల కోట్లు సాయం ప్రకటించగానే ఇలా 12 వేల కోట్లతో iconic buildings అంటూ ప్రకటనలిస్తే అంతే ఉంటుంది. జుట్టు చెరిపేసుకొని, చొక్కాలు నలిపేసుకొని దీనగా మొహాలు పెడితే ఓ 150 కోట్లు గీచి ఇస్తుంది కరోడా లేXడీ.

  7. అలా 15 వేల కోట్లు సాయం ప్రకటించగానే ఇలా 12 వేల కోట్లతో iconicx bbuildings అంటూ ప్రకటనలిస్తే అంతే ఉంటుంది. జుట్టు చెరిపేసుకొని, చొక్కాలు నలిపేసుకొని దీనగా మొహాలు పెడితే ఓ 150 కోట్లు గీచి ఇస్తుంది కరోడా లేడీ.

  8. ఆస్తులు పెంచడానికి అప్పులు చేస్తే తప్పేముంది? మీ పార్టీ లాగా పంచడానికి అప్పులు చెయ్యడం లేదు కదా?

  9. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ చేసిన వివిధ వ్యాఖ్యల మేరకు రాష్ట్రనికి ఇచ్చే అప్పుకి కేంద్రం గారంటీ ఇస్తున్నట్టు అందరూ అనుకున్నారు..ఇప్పుడు మంత్రి నారాయణ చెప్పింది కూడా అదే..కాకపోతే గారంటీ అనే పదాన్ని మాత్రమే వాడలేదు.

Comments are closed.