ఆమె ఫొటోలు కాలిస్తే, ఇతడు బ్లాక్ చేశాడు

బాలీవుడ్ లో డేటింగ్స్ ఎంత కామనో, బ్రేకప్స్ కూడా అంతే కామన్. ఇలా బ్రేకప్ పెట్టి, అలా ఫ్రెష్ గా మరో డేటింగ్ ప్రారంభించే నటీనటులు కోకొల్లలు కనిపిస్తారు. మాజీ భాగస్వామితో పెద్దగా శత్రుత్వాలు…

బాలీవుడ్ లో డేటింగ్స్ ఎంత కామనో, బ్రేకప్స్ కూడా అంతే కామన్. ఇలా బ్రేకప్ పెట్టి, అలా ఫ్రెష్ గా మరో డేటింగ్ ప్రారంభించే నటీనటులు కోకొల్లలు కనిపిస్తారు. మాజీ భాగస్వామితో పెద్దగా శత్రుత్వాలు మాత్రం పెట్టుకోరు. కానీ అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం విడిపోయి శత్రువుల్లా మారిపోయారు.

ఆదిత్య రాయ్ తో చాన్నాళ్లు డేటింగ్ చేసింది అనన్య. ఈమధ్యే అతడితో విడిపోయింది. తన క్లోజ్ ఫ్రెండ్స్ కు బ్రేకప్ పార్టీ కూడా ఇచ్చింది. విడిపోయిన తర్వాత ఆదిత్య రాయ్ కపూర్ ఫొటోలన్నింటినీ కాల్చేసినట్టు ఆమె పరోక్షంగా వెల్లడించింది.

ఈ వార్త కొన్ని రోజుల కిందట వైరల్ గా మారింది. ఇప్పుడు ఆదిత్యరాయ్ వంతు వచ్చింది. మరి బ్రేకప్ తర్వాత ఇతడేం చేశాడు.

ఎప్పుడైతే బ్రేకప్ అయిందో, అప్పుడే అనన్య పాండే నంబర్ ను బ్లాక్ చేశాడట ఈ హీరో. బ్రేకప్స్ ను ఎలా డీల్ చేస్తావంటూ ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు స్పందించిన ఆదిత్య రాయ్ కపూర్.. తనకు వందకు పైగా మెసేజీలు వచ్చాయని, ఒక్క మెసేజ్ కూడా పట్టించుకోకుండా నంబర్ బ్లాక్ చేశానంటూ, అనన్యా పాండే పేరు ప్రస్తావించకుండా ప్రకటించాడు. చూస్తుంటే, విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ బద్ధశత్రువుల్లా మారినట్టున్నారు

3 Replies to “ఆమె ఫొటోలు కాలిస్తే, ఇతడు బ్లాక్ చేశాడు”

Comments are closed.