ఈ ఏడాది పూర్తవ్వడానికి అటుఇటుగా 2 నెలలు మాత్రమే టైమ్ ఉంది. కానీ హిట్ కొట్టాల్సిన నటీనటుల జాబితా మాత్రం చాలా ఉంది. వీళ్లలో చాలామంది ఈ ఏడాది ఇప్పటివరకు సినిమా రిలీజ్ చేయలేదు. మరికొంతమంది మాత్రం రాబోయే 2 నెలలపై గంపెడాశలు పెట్టుకున్నారు.
కిరణ్ అబ్బవరం.. వరుసగా ఫ్లాపులిస్తున్నాడు, ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నాడు కూడా. ఈసారి ‘క’ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. తొలిసారి పాన్ ఇండియా లెవెల్లో లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న విజయాన్ని ‘క’తో అందుకుంటానంటున్నాడు. 31న ఈ సినిమా రిలీజ్.
వరుణ్ తేజ్ ది కూడా ఇదే పరిస్థితి. వరుసగా 2 ఫ్లాపులిచ్చాడు. మట్కాతో కచ్చితంగా తనను తాను నిరూపించుకోవాలి. నటుడిగా కాదు, కమర్షియల్ హీరోగా. నవంబర్ 14న రాబోతున్న ఈ సినిమా హిట్టయితే, వరుణ్ తేజ్ మార్కెట్ గాడిన పడుతుంది. ఈ ఏడాది ఓ హిట్ కొట్టినట్టవుతుంది.
నితిన్ పరిస్థితి కూడా బాలేదు. రెండేళ్ల నుంచి వరుసగా ఫ్లాపులిచ్చాడు. గత చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ అయితే అతిపెద్ద డిజాస్టర్. ఈ బాధల్ని మరిచిపోవాలంటే, అతడు చేస్తున్న రాబిన్ హుడ్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. డిసెంబర్ 20 రిలీజ్.
విశ్వక్ సేన్ పై కూడా ఒత్తిడి ఉంది. ‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ‘మెకానిక్ రాకీ’ పైనే ఆశలన్నీ. ఏమాత్రం తేడాకొట్టినా ఈ ఏడాది ఫ్లాప్ హీరోల జాబితాలో చేరిపోతాడు విశ్వక్.
వీళ్లతో పాటు లిస్ట్ లో సత్యదేవ్, మంచు విష్ణు, నాగచైతన్య కూడా ఉన్నారు. థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ లాంటి సినిమాల తర్వాత తండేల్ చేస్తున్నాడు చైతూ. అటు సత్యదేవ్ నటించిన జీబ్రా, మంచు విష్ణు కన్నప్ప సినిమాలు కూడా రెడీ అయ్యాయి. జీబ్రాను మినహాయిస్తే.. తండేల్, కన్నప్ప ఈ ఏడాది థియేటర్లలోకి వస్తాయో రావో చూడాలి.
ఇకపై ఏ హీరో పరిస్థితి కూడా బాగుండదు. స్టార్ హీరోస్ కి మాత్రం ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేసుకుని ఆనందపడడమే మిగులుతుంది. ఎక్కడో నూటికి కోటికి ఒక్క సినిమా తప్ప ఏదీ కూడా జనాల్ని పూర్తి స్థాయిలో అలరించలేదు.
vc available 9380537747
ఎలాగూ థియేటర్లో చూడం