పుష్ప 2 ఇంకా ఎంత షూట్?

ఈవారం విడుదల అంటే ఇంకా షూట్ చేస్తూనే వుంటారు దర్శకుడు సుకుమార్ అని చెప్పుకుంటారు టాలీవుడ్ లో. ఏనాడు ప్రారంభమైందో… ఇప్పటికీ షూట్ జ‌రుగుతూనే వుంది. ఇంకా చాలా బకాయి వుంది కూడా. ఇంకా…

ఈవారం విడుదల అంటే ఇంకా షూట్ చేస్తూనే వుంటారు దర్శకుడు సుకుమార్ అని చెప్పుకుంటారు టాలీవుడ్ లో. ఏనాడు ప్రారంభమైందో… ఇప్పటికీ షూట్ జ‌రుగుతూనే వుంది. ఇంకా చాలా బకాయి వుంది కూడా. ఇంకా 15 నుంచి ఇరవై రోజుల షూట్ బకాయి వుందని తెలుస్తోంది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 5న ప్రీమియర్లతో విడుదల పక్కా అన్నది నిర్మాతల మాట.

పుష్ప 2 సినిమా కోసం రావు రమేష్ డేట్ లు పది రోజుల వరకు కావాల్సి వుందట. కానీ రావు రమేష్ నవంబర్ 2 వరకు వేరే షూట్ లో బిజీగా వున్నారు. మరి అయన వచ్చే వరకు షూట్ పక్కన పెడతారో, లేదా అయన పాత్ర నిడివి తగ్గిస్తారో?

సినిమా డిసెంబర్ 5న ప్రీమియర్లతో విడుదల కావాలంటే అన్నీ పనులు నవంబర్ నెలాఖరుకే పూర్తి కావాల్సి వుంటుంది. మిక్సింగ్, ఫైనల్ కాపీ, ఓవర్ సీస్ కు కంటెంట్ పంపడంతో సహా. అంటే మరో 40 రోజులు సమయం వుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ను లాక్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కు ఇచ్చేసారు కనుక పెద్దగా ఇబ్బంది వుండకపోవచ్చు అనే అనుకోవాలి.

మైత్రీ మూవీస్ ఈ సినిమాను భారీగా రూపొందించి, భారీగా మార్కెట్ చేసింది. అల్లు అర్జున్ ఈ సినిమా మీదే గత మూడేళ్లుగా వుండిపోయారు.

One Reply to “పుష్ప 2 ఇంకా ఎంత షూట్?”

Comments are closed.