గ్రామీణం – నమ్మకాలు.. చదువు

ఇవ్వాళ సొసైటీ సుఖవంతమైన జీవితానికి అలవాటు పడి వుండొచ్చు. కానీ నిన్నటి కాలం అలా కాదు. చదువు దూరం.. జీవితం భారం.. మూఢ నమ్మకాలు. అచారాలు, కట్టుబాట్లు. ఇలాంటివి ఎన్నో అడ్డంకులు. అందుకే ఇప్పటి…

ఇవ్వాళ సొసైటీ సుఖవంతమైన జీవితానికి అలవాటు పడి వుండొచ్చు. కానీ నిన్నటి కాలం అలా కాదు. చదువు దూరం.. జీవితం భారం.. మూఢ నమ్మకాలు. అచారాలు, కట్టుబాట్లు. ఇలాంటివి ఎన్నో అడ్డంకులు. అందుకే ఇప్పటి సినిమా మేకర్లు మంచి ఇంటెన్సివ్ కథాంశంతో బలమైన సినిమా తీయాలంటే పీరియాడిక్ డ్రామాల వైపే మొగ్గుతున్నారు.

అది నిన్నటి రణస్ధలం అయినా, ఇప్పటి పొట్టేల్ అయినా. సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో తయారైన పొట్టేల్ సినిమా ట్రయిలర్ విడుదలయింది. 80ల దశకంలో తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ లోని ఓ గ్రామంలో జ‌రిగిన కథ గా చూపించారు.

అణగారిన వర్గానికి చెందిన ఓ పాప చదువు కోసం తపించే తండ్రి, ఊరి మీద నమ్మకాల పెత్తనం, పట్టు కలిగిన విలన్, గ్రామం కట్టుబాట్లను దాటిన గొర్రెపిల్ల, దాంతో మలుపు తిరిగిన తండ్రీ కూతుళ్ల చదువు కథ ఇలాంటి లైన్ కనిపించింది ట్రయిలర్ లో. లైన్ ఎలాంటిది అన్నది పక్కన పెడితే బలమైన చిత్రీకరణ, సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అంతకన్నా బలమైన నేపథ్య సంగీతం సమకూరింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి పనితీరును దర్శకుడు తీసుకోగలిగినట్లు ట్రయిలర్ క్లారిటీ ఇచ్చింది. యువచంద్ర, అనన్య నాగళ్ల, అజ‌య్ ల నటన బాగుండేలా వుందనే భావన కలిగించింది. సినిమాలో సమ్ థింగ్ విషయం వుందని తెలుస్తోంది. ఇక సినిమా ఎలా వుంటుంది, కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందా? బలగం మాదిరి మంచి పేరు తెచ్చుకుంటుందా అన్నది విడుదల తరువాత చూడాలి.

4 Replies to “గ్రామీణం – నమ్మకాలు.. చదువు”

Comments are closed.