మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీలో ప్రక్షాళనను వేగవంతం చేశారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలనే జగన్ ఆలోచన సరైందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సారథ్య బాధ్యతల్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. భూమనకు ఉమ్మడి చిత్తూరు నాయకత్వాన్ని అప్పగించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇదిలా వుండగా ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొదట ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతల్ని అప్పగించారు. అయితే ఆయన్ను ఉమ్మడి కడప, కర్నూలు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఇదే సందర్భంలో పార్టీ బాధ్యతల్ని అందరికీ పంచే క్రమంలో వైఎస్ జగన్ చిన్న మార్పు చేశారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేయడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. తిరుమల లడ్డూను హిందువులే కాదు, అన్ని మతాల వాళ్లు పరమ పవిత్రంగా భావిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందనే పే…ద్ద బండరాయిని కూటమి ప్రభుత్వ సారథి వేశారని ప్రతిపక్ష పార్టీ కలవరపడుతున్న సమయంలో ….భూమన కరుణాకరరెడ్డి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీకి పాల్పడలేదని తిరుమలకు వెళ్లి, స్వామి ఆలయం ఎదుట సత్య ప్రమాణం చేయడం కూటమిని ఆత్మరక్షణలో పడేసింది. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని చంద్రబాబు ఆరోపణల్ని దీటుగా తిప్పి కొట్టడంలో భూమన వరుస మీడియా సమావేశాలు శక్తిమంతంగా పని చేశాయి. టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిని పరీక్షించే వ్యవస్థ ఎలా వుంటుందో భూమన వివరించారు.
చంద్రబాబు ఆరోపణల్లో డొల్లతనాన్ని తన వాగ్దాటితో భూమన తిప్పికొట్టారు. మంచి చదువరి, సాహిత్య జ్ఞానం, ఏ విషయాన్నైనా జనంలోకి తీసుకెళ్లే మాటల నేర్పరితనం కరుణాకరరెడ్డి సొంతం. 1972 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మంచి వ్యూహకర్తగా, వైఎస్సార్‌కు నమ్మిన మనిషిగా భూమనకు పేరు వుంది. అంతేకాదు మాటల పొదుపు తెలిసిన నాయకుడిగా, విషయ పరిజ్ఞానం ఉన్న నేతగా ఆయనకు సమాజంలో గౌరవం వుంది.
అందుకే భూమనకు చిత్తూరు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆ జిల్లా శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తిరుపతిలో అందరికీ అందుబాటులో ఉండే భూమనకు జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించడం ద్వారా, ఆధ్యాత్మిక క్షేత్రం కేంద్రంగా కూటమి ప్రభుత్వంపై బలమైన పోరాటాన్ని నిర్మించే అవకాశం వుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు భూమన రాజకీయ నేపథ్యం అదనపు బలంగా చెబుతున్నారు.
చిత్తు చిత్తు గా ఓడిపోయిన ఈ భూమన ఎందుకు..?
కూటమి హవా లో కూడా వైసీపీ నుండి గెలిచిన తిరుపతి ఎంపీ గురుమూర్తి ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా..
ఓహో.. రెడ్డి తోక లేదు కదా..
దీన్నే.. జగన్ రెడ్డి సామాజిక న్యాయం అంటారు..
రేపు ఒక కొండెర్రిపప్ప గాడు ప్రెస్ మీట్ పెట్టి.. సామాజిక న్యాయం గురించి నీతులు చెపుతాడు..
vc available 9380537747
vc estanu 9380537747
Open chesa
Call boy works 9989793850