తండేల్ మీద ఏమిటంత నమ్మకం?

సంప్రదాయ నిర్మాణ సంస్ధలు గీతా, సురేష్. ఇవి మిగిలిన సంస్థల మాదిరిగా కాదు. అచి, తూచి నిర్మాణాలు చేపడతాయి. వేలం వెర్రి వెంట పడవు, తొందరపడవు, రిస్క్ అసలే చేయవు, కానీ గీతా సంస్థ…

సంప్రదాయ నిర్మాణ సంస్ధలు గీతా, సురేష్. ఇవి మిగిలిన సంస్థల మాదిరిగా కాదు. అచి, తూచి నిర్మాణాలు చేపడతాయి. వేలం వెర్రి వెంట పడవు, తొందరపడవు, రిస్క్ అసలే చేయవు, కానీ గీతా సంస్థ తండేల్ అనే సినిమా చేస్తోంది. నాగ్ చైతన్య- సాయిపల్లవి కాంబినేషన్, మంచి కాంబినేషన్ నే, అందులో సందేహం లేదు. చందు మొండేటి దర్శకుడు, కాస్త డిపెండబుల్ దర్శకుడే. కానీ ఈ కాంబినేషన్ మీద 80 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం అంటే మాత్రం రిస్క్ అనే అనుకోవాలేమో?.

తండేల్ సినిమా కోసం గీతా సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది, 80 కోట్లకు పైగానే నిర్మాణ వ్యయం అవుతోంది. వడ్డీలు, ప్రింట్, పబ్లిసిటీ వుండనే వుంటాయి. ఈ సినిమాకు నాన్ థియేటర్ మొత్తం కలిపినా 60 కోట్లకు లోపే వస్తోంది. శాటిలైట్ కాలేదు. మిగిలినవి డీల్స్ సెట్ అయ్యాయి. ఇప్పటికి 50 కోట్ల వరకు రికవరీ వచ్చింది. మరో అరేడు కోట్లు వస్తాయనే నమ్మకం వుంది.

అలా అయినా కూడా ఇంకా పాతిక నుంచి ముఫై కోట్లకు పైగా డెఫిసిట్ వుంటుంది. అంటే సినిమాను తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి అ మేరకు మార్కెట్ చేయాల్సి వుంటుంది. సాయిపల్లవి వుంది కనుక అదర్ స్టేట్స్ లో కాస్త మంచి మార్కెట్ నే వుంటుంది. ఎలా లేదన్నా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 25 కోట్ల వరకు వసూలు చేయాల్సి వుంటుంది.

సినిమా హిట్ అయితే ఇవేమంత పెద్ద నెంబర్లు కాదు. పైగా ఇప్పుడు అదనపు రేట్లు, అదనపు అటలు ఎలాగూ ఇచ్చేస్తున్నారు కనుక, అటు వైపు నుంచి సమస్య వుండదు. కానీ సినిమా కాస్త అటు ఇటుగా వుంటే మాత్రం రిస్కే. బహుశా అదే అలోచనతో కావచ్చు, సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా యావరేజ్ గా వున్నా సంక్రాంతి బరిలో నడిచిపోతుంది. అదే గీతా స్ట్రాటజీ కావచ్చు.

ఏమైనా సరే, నాగ్ చైతన్య కెరీర్ లోనే ఓ భారీ పాన్ ఇండియా సినిమా ఇదే, మళ్లీ ఇప్పట్లో ఇలాంటి సినిమా రావాలి అంటే తండేల్ భారీ హిట్ కావాలి.

7 Replies to “తండేల్ మీద ఏమిటంత నమ్మకం?”

Comments are closed.