సాక్షిలో ప‌నికిరాక‌పోతే పార్టీకి, పార్టీకి ప‌నికిరాక‌పోతే సాక్షికి!

సాక్షిలో బోరుకొచ్చిన బండ్ల‌ను పార్టీలోకి, పార్టీలో బోరుకొచ్చిన బండ్ల‌ను ప‌త్రిక‌లోకి! ఇదేనా.. అధికారం కోల్పోయిన త‌ర్వాత జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని?

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ను ఒక రాజ‌కీయ పార్టీని న‌డుపుతున్నాడో, లేక త‌న చుట్టూ చేరిన కొంత‌మందికి పున‌రావాస శిబిరాన్ని న‌డుపుతున్నాడో అంతుబ‌ట్ట‌దు! అధికారంలో ఉన్నా, అధికారం చేజారినా జ‌గ‌న్ తీరులో మార్పు రావ‌డం లేదు. పార్టీని న‌డ‌ప‌డం అంటే.. అది కుటుంబం ప‌ద్దులు చూసుకోవ‌డం అనుకుంటున్నాడో ఏమో కానీ, జ‌గ‌న్ ఎంపిక‌ల‌న్నీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటాయి! స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో మొద‌లు పెడితే ఈ చిట్టాలో చిత్రవిచిత్ర‌మైన పేర్లు పెరుగుతూనే ఉన్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు!

అస‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టేంత సామ‌ర్థ్యం ఉంద‌ని జ‌గ‌న్ న‌మ్మ‌డ‌మే ఆశ్చ‌ర్యం. స‌జ్జల ఒక ఇంట్రావ‌ర్ట్ లాంటి వ్య‌క్తి. ఎక్క‌డో ప‌త్రిక‌లో డెస్క్ లో ప‌ని చేసుకునేవాడు. ఆయ‌న అన్న ఒక‌రు కాంట్రాక్ట‌ర్ గా పేరు తెచ్చుకోవ‌డం, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ద‌గ్గ‌ర కావ‌డంతో జ‌గ‌న్ పేప‌ర్ పెట్టాల‌నుకుంటున్న ద‌శ‌లో మీ త‌మ్ముడు ఒక‌ప్పుడు జ‌ర్న‌లిస్టే అంట క‌దా, మా వాడికి అటాచ్ చెయ్ అని వైఎస్ చెప్ప‌డంతో.. ఎప్పుడో ఉద‌యం ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేసిన స‌జ్జ‌ల రాత్రికి రాత్రి సాక్షికి ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్ అయ్యాడు. అంతే కానీ, ఆయ‌న ఏదో వీరోచిత జ‌ర్న‌లిస్టు కావ‌డం చేత కూడా కాదు! మ‌రి సాక్షి ఒక ప్ర‌త్యామ్నాయ మీడియాగా జ‌నాల్లోకి వెళ్లే స‌రికి స‌జ్జ‌ల పెద్ద జ‌ర్న‌లిస్టు అయ్యారు! స‌రే, అక్క‌డితో ఆగి ఉన్నా పోయేదేం లేదు. అక్క‌డ భార‌తి చైర్మ‌న్ అయ్యాకా, స‌జ్జ‌ల పొస‌గ‌లేక‌పోయారు!

ఎక్క‌డైనా ఒక చోట సెట్ కాని వ్య‌క్తిని ఇంటికి పంపిస్తారు! అయితే జ‌గ‌న్ మాత్రం ఒక చోట ఫెయిల్ అయిన వారికి ప్ర‌మోష‌న్ ఇచ్చి ఇంకో రంగంలో రుద్దుతారు! అదే ప్ర‌త్యేక‌త. ఒక‌వేళ ప‌త్రిక‌లో సెట్ కాని స‌జ్జ‌ల‌ను జ‌గ‌న్ సిమెంట్ ఫ్యాక్ట‌రికీ పంపించి ఉంటే ఆయ‌న పార్టీకి న‌ష్టం ఉండేది కాదు, అయితే స‌జ్జ‌ల‌ను సూప‌ర్ సీఎంగా చేశారు.

అస‌లు జ‌నాల్లో ఏనాడూ ప‌ని చేయ‌డం కాదు క‌దా, క‌నీసం ప‌ది మంది సామాన్యుల‌తో ప‌రిచయం లేని స‌జ్జ‌ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలం అయిపోయాడు. అక్క‌డే జ‌గ‌న్ ప‌త‌నం మొద‌లైంది! అయితే ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌ల్లో స‌జ్జ‌ల ఒక‌రు! త‌మ స్వార్థ‌మే త‌ప్ప మ‌రే ప‌ర‌మావ‌ధి లేని అనేక మంది ఇలాంటి బ‌దిలీల‌ల‌తో జ‌గ‌న్ పార్టీ మీద‌, అత‌డి ప్ర‌భుత్వం మీద ప‌డుతున్నారు!

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మ‌రో నియామ‌కం చిత్రాతిచిత్రంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటెలెక్చువ‌ల్ ఫోరం అంటూ ఒకటి క్రియేట్ చేశార‌ట‌, దానికి అధ్య‌క్షుడిగా వై. ఈశ్వ‌ర ప్ర‌సాద రెడ్డిని నియ‌మించార‌ట‌! మ‌రి ఎవ‌రీ ఈశ్వ‌ర‌ప్ర‌సాద రెడ్డి అంటే, వైఈపీ రెడ్డి అంటూ సాక్షిలో ఇన్నేళ్లూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తే ఈయ‌న‌! సాక్షి ప‌త్రిక‌, టీవీ చాన‌ల్ ప్రారంభం ద‌శ నుంచి ఈయ‌న అక్క‌డ ప‌ని చేసిన‌ట్టుగా ఉన్నారు. డైరెక్ట‌ర్ స్థాయి ప‌ద‌విలో సాక్షిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. మ‌రి అక్క‌డ ఆయ‌న చేసిన అద్భుతాల గురించి ఉద్యోగులు ర‌క‌ర‌కాలుగా చెబుతూ ఉంటారు. మ‌రి అక్క‌డ అమోఘ‌మైన విజ‌యాల త‌ర్వాత ఇప్పుడు పార్టీలోకి తీసుకున్నట్టుగా ఉన్నారు!

అంటే.. సాక్షిలో బోరుకొచ్చిన బండ్ల‌ను పార్టీలోకి, పార్టీలో బోరుకొచ్చిన బండ్ల‌ను ప‌త్రిక‌లోకి! ఇదేనా.. అధికారం కోల్పోయిన త‌ర్వాత జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని? రేపోమాపో ఆర్. ధ‌నుంజ‌య్ రెడ్డిని సాక్షికి ఎడిట‌ర్ గా చేస్తార‌ట‌! సాక్షిలో గ‌తంలో కీల‌క హోదాల్లో ప‌ని చేసి, అక్క‌డ భారతితో పొస‌గ‌క ప్ర‌భుత్వంలో నామినేటెడ్ పోస్టును పొందారు ఈ ఆర్. ధ‌నుంజ‌య్ రెడ్డి. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది కాబ‌ట్టి, మ‌ళ్లీ బ్యాక్ టు సాక్షి! ఈ సారి ఏకంగా ఎడిట‌ర్ గాన‌ట‌!

అయితే ఇవే కాదు, జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా ఏపీలో వివిధ నామినేటెడ్ పోస్టుల్లో సాక్షిలో పని చేసిన అనేక మందిని నియ‌మించారు! వారిలో తెలంగాణ వారు కూడా ఉన్నారు. ఆఖ‌రికి వారిలో కొంద‌రు జ‌గ‌న్ ప‌ద‌వులు వ‌దిలేసి కూడా వెళ్లారు. మ‌రి ప్ర‌భుత్వం న‌డ‌ప‌డం, పార్టీని న‌డ‌ప‌డాన్ని ముందు త‌న ప‌త్రిక నుంచి వేరు చేసి చూస్తే జ‌గ‌న్ కే మంచిది. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే నెపోటిజం ప్రోడ‌క్ట్ అనుకుంటే ఆయ‌న త‌న‌యుడికి సోష‌ల్ మీడియా హెడ్. స‌జ్జ‌ల అనుంగుగా ఆర్. ధ‌నుంజ‌య్ రెడ్డికి కీల‌క హోదాలు! ఈసోర‌మ‌న్న‌ట్టుగా ఉన్నాయి జ‌గ‌న్ వ్య‌వ‌హారాలు అన్నీ.

కుటుంబానికి అనుంగులు, స‌న్నిహితులు, విశ్వాస‌ప‌రులు అంద‌రికీ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా ఆర్థికంగా సాయం చేసుకోవ‌చ్చు. త‌మ కుటుంబంపై విశ్వాసం చూపిస్తున్న వాళ్ల‌కు అలాంటి భ‌రోసాలు ఇవ్వొచ్చు. అంతే కానీ, త‌మ‌కు విశ్వాస‌ప‌రులు అయిన మాత్రానా వారి సామ‌ర్థ్యంపై ఎక్కువ అంచ‌నాలు పెట్టుకుని, వారే అంతా ఉద్ద‌రించేస్తార‌నుకోక‌డ‌దు! ఎక్క‌డ పెట్టాల్సిన వాళ్ల‌ను అక్క‌డ పెడితే అదో ముచ్చ‌ట‌! అయితే జ‌గ‌న్ వ్య‌వ‌హారాలు మాత్రం అలా లేవు, అధికారం కోల్పోయినా వాటిల్లో మార్పు అయితే క‌నిపించ‌డం లేదు! రాజ‌కీయ పార్టీని న‌డిపించ‌డం విష‌యంలో జ‌గ‌న్ మ‌ళ్లీ మొద‌టి నుంచి నేర్చుకోవాల్సిన ప‌రిస్థితుల్లో అయితే క‌నిపిస్తున్నారు!

31 Replies to “సాక్షిలో ప‌నికిరాక‌పోతే పార్టీకి, పార్టీకి ప‌నికిరాక‌పోతే సాక్షికి!”

  1. 2019 లో జగన్ గెలిచింది ప్రశాంత్ కిషోర్ వల్ల. అతనికి తెలివి ఇవాళ కొత్తగా ఏమి వస్తుంది.

  2. మళ్ళీ జగన్ రెడ్డి తనకి మీడియా లేదు.. మీడియా సపోర్ట్ లేదు అని డే లైట్ లో .. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేస్తాడు..

    మళ్ళీ వెంటనే.. అబద్ధాలు చెప్పి ఉంటె.. అధికారం నిలుపుకొనేవాళ్ళం.. అనేసి మరో అబద్ధం వదిలేస్తాడు..

    ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. ఈ జగన్ రెడ్డి..

  3. పెళ్ళాం ఎగిరి తంతే మొగుడు దగ్గర ఆశ్రయం

    మొగుడు ఎగిరి తన్నితే పెళ్ళాం దగ్గర ఆశ్రయం

    భలే మొగుడూ పెళ్ళాలు..

    మధ్యలో బంతులాట.

  4. ఒరే బాబు నువ్వు ఎన్ని కబుర్లు రాసిన వాడు మారడు, అసలు వైసిపి నిజమైన అభిమానులు ఈ సైట్ కి రావటం మానేసి 3 ఇయర్స్ దాటిపోయింది..నలంటోల్లు టైమ్ పాస్ కి అప్పుడపుడు వస్తుంటం అంతే..

  5. జగన్ యొక్క నేరాలు, ఘోరాలు, అవినీతి సొమ్ము అత్యంత కీలక రహస్యాలు సజ్జలు చేతిలో వున్నాయి, అందుకే సజ్జలు నుంచో అంటే టక్కున నుంచుంటాడు, సజ్జలు కూర్చో అంటే టక్కున కూర్చుంటాడు.

    సర్కస్ లో కో*తి నీ ఎలా ఆడిస్తారో అలానే సజ్జలు చేతిలో జగన్ ఒక కీలు బొమ్మ.

  6. సజ్జలు మీద గ్రేట్ ఆంధ్ర వెంకట రెడ్డి డైరెక్ట్ ఆటాక్.

    మధ్యలో జగన్ ఎంత పనికిరాని బేవక్కొప్ప్సన్నాసి అనేది నిజాలు మీరే చెబుతున్నారు. ప్రొసీడ్.

  7. నువ్వు ఎన్ని కబుర్లు రాసిన అక్కడ యేమి అవ్వదు..ఎందుకంటే అన్న నీలంటల్లకు యేమి చేయడు.మో..కుడి..పించే..వాళ్లకు మాత్రమే అన్న దర్శనం..

  8. మీరే చెప్తున్నారు కదా మేడం గారు తో సున్నం పెట్టుకుంటే కానీ అన్న కి ఎవరు ఆనడం లేదు అని… ఇంకేం ఆవిడ మీద డైరెక్ట్ ఎటాక్ చేసెయండి ఏడా పెడ… ఇంకా అన్న మీ వీరత్వం గుర్తించి వెదవది సోషల్ మీడియా ఏందీ ఏకం గా ఉపాధ్యక్షులు గా చేసేస్తారు

  9. మా కంపెనీ లో ఒక హెడ్ ఇంటికి జనాలు వెళ్తూ కూరగాయలు వంటి నిత్యావసరాలు చూస్తూ వదిన టీ సూపర్, వదిన వండిన పలావ్ సూపర్ అనే వాళ్ళను ఆ హెడ్ బాగా చూసుకునే వాడు. నాలాంటి వాళ్ళకు ఆ యాక్టింగ్ అంటే చిరాకు!

    1. కొందరు హెడ్ ఏమి చేసినా మాస్ అంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ రాజకీయాలలో కూడా అంతేనేమో!

    2. ఇదేంటి సార్ మేం పీజీ లో నా,పీహెచ్డీ లో గైడ్ చుట్టూ ఇలా తిరిగాం కానీ ఇలా ఉద్యోగాలు వచ్చాక కూడా బాస్ వాళ్ల ఇంటి క్షేమం సమాచారం పట్టించుకుంటారా??? ఎదో బాస్ కి తాళం వెయ్యడం.. సోప్ వెయ్యడం లాంటివి ఐతే విన్నాం కానీ..

  10. నీ బాధ ఏంట్రా..హౌలే గా..గత 5 సంవత్సరాలు గా నువ్వు చేసింది ఏంటి..బజన నే కదా..వాడు పిత్తినా ఆహా బలే ఉంది అన్నవదివే కదా..ఇప్పుడేంటి ఈ గోల

  11. పేపర్ కి పనికి రాకపోతే పార్టీకి, పార్టీకి పనికి రాకపోతే పేపర్ కి, రెండింటికి పనికి రాకపోతే పార్టీ ప్రెసిడెంట్ గా..

  12. 2019 లో పార్టీ గెలిచిందే మా సజ్జలు వ్యూహల ప్రతిభ వల్ల.. అందుకే పనికిరాని సన్నాసి సీఎం అయితే మావోడు సూపర్ సీఎం అయ్యి ప్రభుత్వ0 లో అన్నీ తానై చివరికి మీడియా ని కూడా పేస్ చేస్తూ ఒంటరి పోరాటం చేసాడు.. కానీ ‘EVM లు మోసం చేసాయ్ లేకపోతే 175/175 వచ్చేవి..

    జెగ్గులు గాడు మొగోడే అయితే సజ్జలు ని టచ్ చెయ్యమను..

  13. జెగ్గులు & సజ్జలు ” విష జంట” ని విడదీస్తే మనకి పాపం చుట్టుకుంటుంది రా ‘ఎర్రి ఎంకన్నా.. వదిలేయ్ వాళ్ళని.. ఇంకో 11 కాలాల పాటు అలాగే ఎంజాయ్ చెయ్యనివ్వు

  14. ఏపీకి రాజధాని విజయవంతంగా పూర్తి అవ్వాలంటే ఇలాంటి దుశ్శాసన పార్టీ పోవాలి

  15. మళ్లీ మొదటినుంచీ మొదలుపెట్టాలి అంటే ఎలా ఎంకటి, అప్పుడంటే నాన్న శవం ఉంది..

    ..అంటే మమ్మీ ని వేసెయ్యమని ఐడియాస్ ఇస్తున్నావా..

  16. సజ్జలు గాడి పని బాగుంది మొగుడు కొడితే “పేపర్ పెళ్ళాం” ని ఎక్కుతాడు.. పెళ్ళాం కాదంటే, పార్టీ లో చేరి మొగుణ్ణి ఎక్కాడు.. అదృష్టం అంటే ఇదే

Comments are closed.