టీడీపీ నేత‌ల దోపిడీపై ఈనాడు క‌న్నెర్ర‌

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి రాజ‌గురువు ప‌త్రిక ఈనాడు క‌న్నెర్ర చేసింది. ఇసుక‌, మ‌ద్యం వ్యాపారాల్లో టీడీపీ నేత‌లెవ‌రూ త‌ల‌దూర్చొద్ద‌ని చెబుతున్నా, వాళ్లు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ క‌థ‌నంలో వాపోవ‌డాన్ని చూడొచ్చు.…

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి రాజ‌గురువు ప‌త్రిక ఈనాడు క‌న్నెర్ర చేసింది. ఇసుక‌, మ‌ద్యం వ్యాపారాల్లో టీడీపీ నేత‌లెవ‌రూ త‌ల‌దూర్చొద్ద‌ని చెబుతున్నా, వాళ్లు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ క‌థ‌నంలో వాపోవ‌డాన్ని చూడొచ్చు. చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌ల‌కు పూర్తి విరుద్ధంగా అనంత‌పురం నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ ముఖ్యంగా మ‌ద్యం దుకాణాల విష‌యంలో దోపిడీకి పాల్ప‌డుతున్నారంటూ స‌మ‌గ్ర క‌థ‌నం రాసింది.

టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు ఏమ‌న్నారో తెలుసుకుందాం.

“పార్టీ నేత‌లెవ‌రూ విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించొద్దు. ఇసుక , మ‌ద్యం వంటి అంశాల్లో త‌ల‌దూర్చొద్దు. వైసీపీ వాళ్లు చేసిన‌ట్టుగా త‌ప్పులు చేయ‌వ‌ద్దు. ప్రజ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాలి. ఈ నాలుగు నెల‌ల్లో మీ ప‌నితీరుకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ నా ద‌గ్గ‌ర వుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ లేకుండా డ‌బ్బుల‌తో ఏ ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌లేరు. డ‌బ్బే ప్ర‌ధాన‌మైతే మ‌న‌కు 93 శాతం విజ‌యం ద‌క్కేది కాదు. మాగుంట కుటుంబం లిక్క‌ర్ వ్యాపారంలో వార‌స‌త్వంగా వుంది. అలాంటి వాళ్ల వ‌ర‌కు స‌రేకానీ, కొత్త‌వాళ్లు ఇందులో దిగాల‌ని అనుకుంటే మాత్రం పార్టీ ప్ర‌తిష్ట పోతుంది. ఈ ఎన్నిక‌ల్లో గెలిచాం కాబ‌ట్టి.. చాల‌నుకుంటే కుద‌ర‌దు” అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఈనాడు ప‌త్రిక‌లో కూట‌మి నేత‌ల దౌర్జ‌న్యాల‌పై ఏం రాశారో చూద్దాం.

“నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌మ సామ్రాజ్యాలుగా కొంద‌రు ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లాట‌రీలో మ‌ద్యం దుకాణాల లైసెన్స్‌లు ఎవ‌రికొస్తే మాకేంటి? మా ఇలాకాలో మేమే వ్యాపారం నిర్వ‌హిస్తాం. మీకు కావాలంటే ఎంతోకొంత సొమ్ము ఇస్తాం. వ‌దిలేసి వెళ్లిపోండి అంటూ కొంద‌రు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. మీరేం చేసుకుంటారో మాకు అన‌వ‌స‌రం. ప్ర‌తి నెలా మాకు క‌ప్పం క‌ట్టాల్సిందే అంటూ ఇంకొంద‌రు ఎమ్మెల్యేలు హెచ్చ‌రిస్తున్నారు. శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. ఈ నాయ‌కుల దెబ్బ‌కు కొంత‌మంది దుకాణాలు తెరవడానికి భ‌య‌ప‌డిపోతున్నారు”

ఈ క‌థ‌నంలో ఎక్కడెక్క‌డ ఏ ర‌కంగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారో వివ‌రించారు. ఆదాయం విష‌యంలో చంద్ర‌బాబు బెదిరింపుల‌కు పాల్ప‌డే ప‌రిస్థితి ఏ మాత్రం లేదు. ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే. ఇంకా నాలుగున్న‌రేళ్ల పాటు కూట‌మి అధికారంలో వుండ‌నుంది. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వ‌స్తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఆలోచ‌న త‌ప్ప‌, మంచీచెడ్డ‌ల గురించి ఆలోచించే నాయ‌కులెవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

10 Replies to “టీడీపీ నేత‌ల దోపిడీపై ఈనాడు క‌న్నెర్ర‌”

  1. వీడు కాకపోతే వాడు … వాడు కాకపోతే వీడు.. ఇలా సంపాదన కోసం అడ్డదారులు తొక్కడం… అవిచూసి ప్రజలు ఈసారి వీడి దూల తీర్చేద్దాం అనుకుని వాడికి ఓటు వేయడం… వాడు వచ్చి అదే కంటిన్యూ చేయడం. . next టైమ్ జనాలు అవతలి వాడికి అధికారం అప్పజెప్పడం… ఇదొక నిరంతర ప్రక్రియ. నో వన్ కాన్ చేంజ్.

    1. but jagan antha palana kanna challa bettr .TCS is coming .amaravthi progres started . suzlon enrgy strating . XLRI is coming LULU and oberay starting . dont get panic .Things will work out . we cant elimnate corruption fully .Only to what exnetent is the mater . 4500 cr works initated in panchayithees

  2. పచ్చ మీడియా, దుష్టచతుష్టయం అని ఏడ్చి సచ్చాడు ఒకడు..

    ఇప్పుడు ఆంధ్ర జ్యోతి, ఈనాడు రెండూ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి.. ఒక ప్రతిపక్ష పాత్ర ని సమర్ధవంతం గా నిర్వర్తిస్తున్నాయి..

    గతం లో సాక్షి ఏనాడైనా ఇలా జగన్ రెడ్డి తప్పులు రాసేదా.. పోనీ గ్రేట్ ఆంధ్ర..?

    పొద్దున్న లేచింది మొదలు.. 24 గంటలూ.. జగన్ రెడ్డి భజన..

    ప్రజలు తమ కళ్ళతో చూసేదాన్ని కూడా.. నీలి మీడియా లో వక్రీకరించి.. అంతా జగన్ రెడ్డి గొప్పతనమే అనే కలరింగ్ ఇచ్చేవాళ్ళు.. అందుకే ఈరోజు పతనమైపోయారు ..

    ఆ తప్పు పచ్చ మీడియా చేయడం లేదు..

    ప్రజలు విషయం చూసేలోపు.. టీడీపీ ప్రభుత్వాన్ని మేల్కొలుపుతున్నారు..

    1. Thanks sir. నేను పెట్టాలనున్న కామెంట్ మీరు పెట్టి నా శ్రమ తగ్గించారు😄

  3. పత్రిక అంటే ఈనాడు లా ఇలానే వుండాలి.

    టాయి*లెట్ లొ ము*డ్డి తుడుచుకునే సాక్షి , గ్రేట్ ఆంద్ర పేపర్ లా వుండకూడదు.

  4. అవునంటె కాదనిలె కాదంటె అవుననిలే ….. ఇలాంటి రానా గాల్ల మాటలకు అర్ధాలె వేరులే అర్ధాలె వేరులే..

Comments are closed.