సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న ఓ న్యూస్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో మా గ్లోబల్ స్టార్ ఎందుకు నటిస్తాడంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మేటర్ ఏంటి?
ప్రస్తుతం లియో అనే సినిమా చేస్తున్నాడు విజయ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడనేది తాజా ఊహాగానం. దీనికి కారణం చరణ్-లోకేష్ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే.
దీంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో స్టార్ హీరోలు మెరవడం కామన్. అతడి గత సినిమాల్లో ఇది చాలాసార్లు జరిగింది. కాబట్టి లియోలో కూడా అలాంటి 'మెరుపు' ఒకటి ఉంటుందని, అది మెగా మెరుపు అవ్వొచ్చని పుకార్లు మొదలయ్యాయి.
ఇక మరో కారణం ఏంటంటే, తాజాగా రామ్ చరణ్ కూడా ఓ సినిమాలో మెరిశాడు. సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ సాంగ్ లో గెస్ట్ ఎప్పీయరెన్స్ ఇచ్చాడు. కాబట్టి లియోలో కూడా చరణ్ కనిపించే ఛాన్స్ ఉందంటూ కథనాలు వచ్చాయి.
వీటన్నింటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ చరణ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలో కనిపించే ఛాన్స్ లేదంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఇది రూమర్ మాత్రమే. విజయ్ సినిమాలో చరణ్ కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా అది పెద్ద తప్పేం కాదు. ఎఁదుకంటే విజయ్ చాలా పెద్ద హీరో. కానీ మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం మాత్రం విజయ్ ఇమేజ్ ను కించపరిచే విధంగా సాగుతోంది సోషల్ మీడియాలో.