జనసేనాని పవన్‌కల్యాణ్ పెళ్లిళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలు జనసేనను తీవ్రంగా బాధిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదేపదే పవన్‌కల్యాణ్ నాలుగేసి పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌లా మనం నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేమని ఘాటు వ్యాఖ్య చేస్తుండడం రాజకీయ దుమారానికి కారణమైంది.
పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ వ్యాఖ్యలను మాజీ ఎంపీ, కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ సీఎం జగన్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్‌పై చేగొండి ఎంత అక్కసుతో ఉన్నారంటే, చివరికి ఆయన పుట్టుకను కూడా ప్రశ్నించే పరిస్థితి. ఇదే లేఖలో వైఎస్సార్‌ను సంస్కారిగా అభివర్ణించడం విశేషం. చేగొండి లేఖలోని ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం.
“ప్రతిపక్ష నాయకుల పట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పుడప్పుడు చేసే విమర్శలు ఎంతో హుందాగా వుండేవి. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ హుందానంలో పదో వంతు కూడా మీకు లేదనిపిస్తోంది. అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోంది … ముఖ్యమం త్రిగా మీ ప్రవర్తన చూస్తోంటే.
ప్రజల ఆరాధ్య నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు పవన్‌కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకెవ్వరికీ లేని అభ్యంతరం మీకెందుకు? పవన్‌కల్యాణ్‌పై బురద చల్లటానికి మరే కారణాలు లేకే ఇలాంటి చవకబారు రాజకీయాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టుగా వుంది.
మాట్లాడితే పవన్‌కల్యాణ్‌ని చంద్రబాబుకి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తుంటారు. మీరు కేసీఆర్‌కి దత్త పుత్రుడుగా 2019 ఎన్నికల్లో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయలు ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ని తెలంగాణాకు తాకట్టు పెట్టలేదా?
ఇకపై పవన్‌కల్యాణ్‌పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడ్తారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు. మీపై అభియోగాలు మోపాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు బాధగా వుంది. మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం నాకు అలవాటు. వాళ్లు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా…తప్పు వుంటే వాళ్ల మొహం మీదే కుండబద్ధలు కొట్టడం నా నైజం. క్షమించండి”
పవన్‌కల్యాణ్ మాత్రం సీఎం వైఎస్ జగన్‌ను ఏమైనా తొట్టొచ్చు, కానీ ఆయన మాత్రం అన్నీ పడుతూ వుండాలనే రీతిలో చేగొండి అభిప్రాయాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో సీఎం వైఎస్ జగన్‌కు పేచీ లేదు. ఎందుకంటే చిరంజీవి హుందాగా వుంటారు. కానీ పవన్‌కల్యాణ్ అలా వుండకపోవడమే సమస్య. పవన్ పెళ్లిళ్లపై విమర్శలు చేసినా, దత్త పుత్రుడన్నా, ప్యాకేజీ స్టార్ అన్నా చేగొండికి కోపమే. ఇంతకూ పవన్‌పై ఎలాంటి విమర్శలు చేయాలో, అసలు చేయొచ్చో, లేదో ఆయన సెలవిస్తే, సీఎం జగన్ ఆ విధంగా నడుచుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు.
జీవిత చరమాంకంలో ఉన్న చేగొండి హరిరామ జోగయ్య కనీస విచక్షణ కూడా లేకుండా జగన్‌పై దారుణ కామెంట్స్ చేసి, చివరికి ఆ పరిస్థితి వచ్చినందుకు క్షమాపణ చెప్పడం ఎంత వరకు సబబో ఆయనే ఆలోచించుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్‌పై హరిరామ జోగయ్యకు ఆరాధన వుండొచ్చు. అలాగని ప్రత్యర్థులపై దారుణ కామెంట్స్ చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తింది.