ఆర్ఎక్స్ 100 అజయ్ భూపతి నిర్మాతగా మారి చేస్తున్న ప్రయత్నం ‘మంగళవారం’. ఈ టైటిల్ వెనుక అనాదిగా వినిపించే ద్వదార్థం వుండడంతో, మొదటి నుంచీ ఆసక్తి జనరేట్ అయింది. ఇప్పుడు ఈ టీజర్ వచ్చి. అసలు విషయం కొంత బయట పెట్టింది. ఓ మిస్టరీ థ్రిల్లర్ ను దర్శకుడు అజయ్ భూపతి అందిస్తున్నారు అని అర్థమైంది. బహశా ఈ మిస్టరీ సంఘనటలు అన్నీ మంగళవారం నాడు జరగడం అనే కాన్సెప్ట్ ఏదో సినిమాలో వుండి వుండొచ్చు.
వదిలిన టీజర్ అయితే చాలా ఆసక్తికరంగా వుంది. ముఖ్యంగా కట్ చేసిన తీరు, దానికి అందించిన బ్యాక్ గ్రవుండ్ స్కోరు రెండూ బాగున్నాయి. టీజర్ నిడివి 60 సెకన్లకు కొంచెం ఎక్కువ. ఆ టీజర్ లోనే అజయ్ భూపతి చాలా అంశాలు చూపించి ఆసక్తి కలిగించారు. ఊరి ప్రజలు ఏం చూస్తున్నారు? అనేది ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ, ప్రస్తుతానికి సస్పెన్స్.
టీజర్ ఎండింగ్ అయితే మరింత క్యూరియాసిటీ కలిగించింది. అమ్మవారి మాస్క్ ఎవరో తీసుకోవడం, గొంగళి కప్పుకొని మంటల మధ్యలో పాయల్ నిలబడటం, చివరిలో గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తూ అరవడం… ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. ప్రేక్షకుల్లో ఆలోచన కలిగించినవే. విజువల్స్‌కు తోడు అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్యం సంగీతం టీజర్ కు బాగా ప్లస్ అయింది.
టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ మాట్లాడుతూ ''దర్శకుడిగా అజయ్ భూపతి తాను ఏంటో నిరూపించుకున్నారు. కంటెంట్ తో కూడిన కమర్షియల్ ఫిల్మ్స్ తీశారు. ఈసారి నెక్స్ట్ లెవల్ సినిమా ప్రేక్షకులకు చూపించబోతున్నారు అన్నారు.
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది' అని చెప్పారు.