మొన్నటికిమొన్న తనపై జరిగిన బాడీ షేమింగ్ ను తీవ్రంగా ఖండించింది హీరోయిన్ అలియా భట్. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వచ్చిన వార్తల్ని ఖండిస్తూ, సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టింది. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది.
నయనతారపై కూడా కొన్నాళ్లుగా ఈ తరహా ప్రచారం నడుస్తోంది. ఆమె ముఖం మారిపోయిందని, బహుశా, ఆమె కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిపై తాజాగా స్పందించింది నయన్.
“నాకు కనుబొమ్మలు షేప్ చేయించుకోవడం చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త ఐబ్రోస్ ట్రై చేస్తుంటాను. అందువల్ల నా ముఖం మారినట్టు కొందరికి అనిపిస్తుంది. అంతేతప్ప, నేను ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. కావాలంటే నన్ను గిచ్చి చూడండి, నా ముఖంపై కాస్మొటిక్ సర్జరీ కనిపించదు.”
ఇలా తన ముఖం మారడంపై క్లారిటీ ఇచ్చింది నయనతార. దీంతోపాటు తన శరీర బరువుపై కూడా ఆమె స్పందించింది. ఆమె కొన్నిసార్లు లావుగా, మరికొన్నిసార్లు సన్నగా కనిపిస్తోందని.. లైపోసక్సన్ చేయించుకుందంటూ ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన నయనతార, తను ఎప్పటికప్పుడు ఆహారపు అలవాట్లు మారుస్తుంటానని, అందువల్ల కొన్నిసార్లు తన బుగ్గలు బయటకు కనిపిస్తాయని, మరికొన్నిసార్లు బుగ్గలు లోపలకు వెళ్లినట్టు అనిపిస్తాయని అంటోంది. కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవడమనేది హీరోయిన్ల వ్యక్తిగత ఎంపిక అని, ఇందులో ఎవ్వర్నీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని అంటోంది నయనతార.
Call boy works 9989793850
vc estanu 9380537747