ఒక కొత్త కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హీరోలు రవితేజ-విష్వక్ సేన్-మంచు మనోజ్ లను ఒకే సినిమాలో సెట్ చేస్తున్నారు.
కలర్ ఫొటో సినిమా తీసిన దర్శకుడు సందీప్ రాజ్ తయారు చేసుకున్న ఓ కథ ను హీరో రవితేజ సూత్ర ప్రాయంగా ఓకె చేసారు. ఈ కథలో విష్వక్ సేన్ మరో హీరోగా నటిస్తారు. అలాగే విలన్ గా మంచు మనోజ్ నటిస్తారు. అయితే ఈ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తారు.. ఏయే బ్యానర్లు కలుస్తాయి.. ఇలాంటివి అన్నీ ఇంకా ఫైనలైజ్ కావాల్సి వుంది.
సందీప్ రాజ్ అయితే మాస్ మూవీ మేకర్స్ దగ్గర లాక్ అయి వున్నారు. అదే బ్యానర్ మరో బ్యానర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఆ బ్యానర్ ఏదన్నది రవితేజ డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం రవితేజ చేయబోయేది గోపీచంద్ మలినేని – మైత్రీ సినిమా. ఆ తరువాత సితార బ్యానర్ సినిమా. ఆ తరువాతనే ఏ సినిమా అన్నది డిసైడ్ అవుతుంది. సూత్ర ప్రాయంగా ఓకె చేసిన సినిమాలు చాలానే వున్నాయి. కానీ ఏది ముందు, ఏది వెనుక అన్నది ఇప్పట్లో తెలిసేది కాదు.