ఆ గ్రామాలు దీపావళికి దూరం

దీపావళి అంటే పెద్దలంతా పిల్లలు అయిపోతారు. పల్లె పట్నం తేడా ఉండదు. అమావాస్య నాడు పున్నమి వస్తుంది. ఇలా వెన్నెల పండుగగా చెబుతారు. దీపావళి పండుగ అంటే ఇష్టం లేని వారు లేరు. అయితే…

దీపావళి అంటే పెద్దలంతా పిల్లలు అయిపోతారు. పల్లె పట్నం తేడా ఉండదు. అమావాస్య నాడు పున్నమి వస్తుంది. ఇలా వెన్నెల పండుగగా చెబుతారు. దీపావళి పండుగ అంటే ఇష్టం లేని వారు లేరు. అయితే ఉత్తరాంధ్రలో రెండు గ్రామాల ప్రజలు మాత్రం దీపావళి పండుగను జరుపుకోరు. ఆ రోజును వారు సెంటిమెంట్ గా భావించి దూరం గా ఉంటారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం లో గత రెండు వందల ఏళ్ళుగా దీపావళిని జరుపుకోవడం లేదు అని గ్రామస్తులు చెబుతున్నారు

అప్పట్లో ఉయ్యాలలో నిద్రిస్తున్న ఒక పాపను పాము కాటు వేయడంతో మరణించింది. అదే రోజు రెండు ఎద్దులు కూడా అకారణంగా మృత్యువాత పడ్డాయి. దాంతో దానిని గ్రామస్తులు యాంటీ సెంటిమెంట్ గా భావించి నాటి నుంచి నేటి వరకూ దీపావళి ఊసే ఎత్తరు. ఇది బయటవారికి విచిత్రంగా ఉన్నా వారికి మాత్రం ఆ రోజు ఒక విషాదంగా ఉంటుంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని రావికమతం మండలం కిత్తంపేట గ్రామస్తులు కూడా కొన్నేళ్ళుగా దీపావళిని జరుపుకోరు. ఇదే వారి ఆనవాయితీగా వస్తోంది. పూర్వకాలంలో దీపావళి వేళ టపాసులు పేల్చిన ఘటనలో గ్రామం మొత్తం అగ్నికి ఆహుతి అయింది. దాంతో నాటి నుంచే గ్రామంలో దీపావళిని నిషేధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. అలా ఆ విధానం నేటికీ కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. దీపావళి పండుగను చేసుకోని ఈ రెండు గ్రామాలూ ప్రతీ ఏటా అంతా చర్చించుకునేలా చేస్తున్నాయి. సెంటిమెంట్ ని నమ్మిన వారు దానిని కొనసాగించడం తప్పు లేదు. అందుకే వారు అదే విధానం అనుసరిస్తున్నారు.

6 Replies to “ఆ గ్రామాలు దీపావళికి దూరం”

Comments are closed.