బాలీవుడ్ లో కొత్త డేటింగ్ జంట

బాలీవుడ్ లో డేటింగ్స్ సర్వసాధారణం. ఎంత ఈజీగా ప్రేమలో పడతారో, అంతే ఈజీగా బ్రేకప్ చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో మరో కొత్త లవ్ జంట పుట్టుకొచ్చింది. Advertisement ఈసారి ప్రేమ వార్తల్లో నిలిచింది…

బాలీవుడ్ లో డేటింగ్స్ సర్వసాధారణం. ఎంత ఈజీగా ప్రేమలో పడతారో, అంతే ఈజీగా బ్రేకప్ చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో మరో కొత్త లవ్ జంట పుట్టుకొచ్చింది.

ఈసారి ప్రేమ వార్తల్లో నిలిచింది ఎవరో తెలుసా? సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్. ఆమె ప్రేమలో పడినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సూపర్ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో ఆమె క్లోజ్ గా ఉంటోందట.

రీసెంట్ గా ఇద్దరూ కలిసి కొన్ని పర్యటనలు కూడా చేపట్టారు. ఆ టైమ్ లోనే ఇద్దరూ క్లోజ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అయితే వీటిపై ఇటు సారా, అటు అర్జున్ ఎవ్వరూ స్పందించలేదు.

బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో సారా అలీఖాన్ ఒకరు. సైఫ్ కూతురుగానే కాకుండా, హీరోయిన్ గా నార్త్ లో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. ఇటు అర్జున్ కూడా మామూలోడు కాదు. మోడలింగ్ తో పాటు జిమ్నాస్ట్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కూడా.

అంతేకాదు, ఇతగాడికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నేత కొడుకు ఇతడు. పంజాబ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో అతిపిన్న వయష్కుడైన కాంగ్రెస్ నేతగా అర్జున్ గుర్తింపు పొందాడు. కొన్ని రోజులు ఇతడు ప్రభుదేవా వద్ద డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా పనిచేశాడు.

ఇలా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్న అర్జున్, ఇప్పుడు సారాపై మనసు పారేసుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఆమెను ఫాలో అవుతున్నాడు. అయితే సారా మాత్రం ప్రస్తుతానికి అర్జున్ ను ఫాలో అవ్వడం లేదు.

4 Replies to “బాలీవుడ్ లో కొత్త డేటింగ్ జంట”

Comments are closed.