కేసీఆర్ పాత్రపై కేటీఆర్ పొంతనలేని మాటలు!

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించి దాదాపుగా ఏడాది కావస్తోంది. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. ప్రశ్నించాల్సిన పోరాడాల్సిన…

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించి దాదాపుగా ఏడాది కావస్తోంది. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. ప్రశ్నించాల్సిన పోరాడాల్సిన కేసీఆర్ ఎక్కడా చప్పుడు చేయడం లేదు ఎందుకు? ఆయన మౌనం పాటిస్తున్నారు ఎందుకు? వంటి సందేహాలు తెలంగాణలో ఎంతోమందిలో ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా సందేహాలు వ్యాపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో మచ్చటించిన ఆయన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాత్రం.. కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉన్నారని అంటున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తారని కూడా అంటున్నారు. అయితే కేసీఆర్ గురించి కేటీఆర్ చెబుతున్న మాటలు చాలా వరకు పొంతనలేకుండా ఉంటున్నాయి.

కేటీఆర్ నెటిజన్లతో మాట్లాడుతూ.. 2025 తర్వాత కేసీఆర్ విస్తృతంగా ప్రజల్లోకి వస్తారని ఒక మాట చెప్పారు. ఈ మాట చాలా సందేహాస్పదంగా ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో.. వచ్చే నెల నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తారు. పార్టీని ఉత్తేజితం చేస్తారు.. వంటి డైలాగులు చెబుతూ వచ్చారు.

నిజానికి పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ బయట అంతగా తిరగడం లేదు. కానీ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఆయన దూకుడైన ప్రచారం చూసిన వారెవ్వరూ ఆయన అనారోగ్యంతో ఉన్నారని అనుకోరు. అంత చురుగ్గా తిరిగారు. మరి జిల్లాల పర్యటనలు మాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ ఒకవైపు గాడితప్పుతున్నదనే సంకేతాలు కూడా గ్రహించడం లేదు.

ఇటీవల- ఈ ఏడాది డిసెంబరు నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని.. ప్రభుత్వంపై పోరాట ప్రణాళికను ప్రకటిస్తారని పార్టీ తెలియజేసింది. ఇప్పుడు కేటీఆర్ తన ముచ్చట్లలో 2025 తర్వాత బయటకు వస్తారని అంటున్నారు. అంటే 2025లోనా? ఆ ఏడాది కూడా పూర్తయిన తర్వాతనా? అనే సందిగ్ధం తొలగడం లేదు.

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. ఇవన్నీ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు పడికట్టు సమాధానాలు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రభుత్వానికి సమయం ఇవ్వదలచుకున్నట్లయితే.. ఆయన తర్వాతి చిన్న నాయకులు అయినటువంటి కేటీఆర్, హరీష్ వంటి వారు ఎందుకు గొంతు చించుకుని విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ సర్కారుకు సమయం ఇవ్వాలనే నియమం వారు పాటించాలి కదా. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినప్పుడే కదా వీరు కూడా దాడి ప్రారంభించాలి.. ఇప్పుడే అత్యుత్సాహపు విమర్శలు చేస్తుంటారు ఎందుకు? అనే వాదన కూడా ఉంది.

ఎప్పుడు అనిపించిందో క్లారిటీ ఇవ్వకుండా.. ఒక దశలో రాజకీయాలనుంచి వైదొలగాలని కూడా అనుకున్నాను అంటూ వైరాగ్యం ప్రదర్శిస్తున్న కేటీఆర్.. పార్టీ అధినేత కేసీఆర్ గురించి చెప్పిన మాటలన్నీ కూడా పొంతనలేకుండా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

12 Replies to “కేసీఆర్ పాత్రపై కేటీఆర్ పొంతనలేని మాటలు!”

  1. ప్రజలు ముక్కోడిని వాడి ఫార్మ్ హౌస్ లోనే సజీవసమాధి చేసి వాడి ఆత్మతో హాలోవీన్ ( Halloween ) ఆడుకుంటున్నారు

    డ్రగ్ రావు గాడు డ్రామాలు ఆపకపోతే వీడికి అదే గతి

  2. ప్రజలు ముక్కోడిని వాడి ఫార్మ్ హౌస్ లోనే సజీవసమాధి చేసి వాడి ఆత్మతో హాలోవీన్ ( Halloween ) ఆడుకుంటున్నారు

    డ్రగ్ రావు గాడు డ్రామాలు ఆపకపోతే వీడికి అదే గతి

  3. పొంతన లేని కబుర్లే కాదు పొంతన లేని పనులు చాలా చేశారు కాబట్టే జనాలు ఇంటికి పంపారు

  4. పూలమ్మిన చోట కట్టెలమ్మాలంటే నామోషీ అనుకుంటా, ఇప్పటికీ తన ఓటమిని జీర్ణించుకోలేని మానసిక పరిస్థితి కావచ్చు. ప్రతిపక్షనాయకునిగా ఉండడానికి ఇష్టపడని పెద్దమనిషికి మరో సారి అధికారం ఇవ్వలంటే అలోచిస్తారు ప్రజలు.

Comments are closed.