బీఆర్‌ నాయుడితో స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు ఖాయం!

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌పై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. అస‌లే ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని అస‌హ‌నం, ఆగ్ర‌హంతో ఉన్న కూట‌మి నాయ‌కులు, ఎవ‌రెవ‌రో కీల‌క ప‌ద‌వుల్ని ఎగ‌రేసుకెళుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో…

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌పై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. అస‌లే ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని అస‌హ‌నం, ఆగ్ర‌హంతో ఉన్న కూట‌మి నాయ‌కులు, ఎవ‌రెవ‌రో కీల‌క ప‌ద‌వుల్ని ఎగ‌రేసుకెళుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అనుబంధ చానెల్ అధిప‌తి బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి లోకేశ్ కోటాలో ద‌క్కింద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.

త‌న‌కు ప‌ద‌వి వ‌చ్చిన ఆనందంతో బీఆర్ నాయుడు దీపావ‌ళి రోజు మీడియాతో మాట్లాడారు. తిరుమ‌ల శ్రీ‌వారిపై భ‌క్తిని చాటుకునేందుకు భ‌క్తుల‌కు ఏదైనా గొప్ప ప‌ని చేస్తాన‌ని చెప్పి వుంటే బాగుండేది. కానీ ప్రెస్‌మీట్‌లో బీఆర్ నాయుడి మాట తీరు గ‌మ‌నిస్తే, ఈయ‌న వ‌ల్ల కూట‌మి స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయాన్ని టీడీపీ నేత‌లే వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లోకేశ్‌ల‌పై త‌న భ‌క్తిని చాటుకునేందుకు బీఆర్ నాయుడు ప్రాధాన్యం ఇచ్చార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. గ‌త ఐదేళ్ల‌లో తిరుమ‌ల‌లో ఘోరాలు, నేరాలు జ‌రిగాయ‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం అందులో భాగ‌మే అని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌సిద్ధ ఆధ్మాత్మిక క్షేత్ర‌మైన టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకున్న బీఆర్ నాయుడు రాజ‌కీయ ఉప‌న్యాసం చేయ‌డం చాలా మంది టీడీపీ నేత‌ల‌కే న‌చ్చ‌లేదు.

అంతేకాదు, శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను ర‌ద్దు చేస్తాన‌ని, ఒక పెద్ద ట్ర‌స్ట్ ఉన్న‌ప్పుడు మ‌రో ట్ర‌స్ట్ ఎందుక‌ని బీఆర్ నాయుడు ప్ర‌శ్నించ‌డంపై టీడీపీ నేత‌లు నోరెళ్ల‌బెడుతున్నారు. శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను 2018లో టీడీపీ హ‌యాంలోనే తీసుకొచ్చార‌నే వాస్త‌వం బీఆర్ నాయుడికి తెలిసిన‌ట్టు లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆరోపించ‌డం, దాన్ని చంద్ర‌బాబు స‌మ‌ర్థించిన సంగ‌తి తెలిసిందే.

వాళ్లిద్ద‌రి మెప్పుకోసం అన్న‌ట్టు, ముందూవెనుకా ఆలోచించ‌కుండా శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌పై బీఆర్ నాయుడు నోరు జారార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌న త‌ర్వాతే శ్రీ‌వారికి ఎవ‌రైనా భ‌క్తుల‌ని లెవెల్‌లో బీఆర్ నాయుడు మాట్లాడారు. అదే నిజ‌మైతే, శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌లో అవినీతిని బ‌య‌ట‌పెట్టాలి. అవినీతిప‌రుల్ని చ‌ట్టం ముందు నిల‌బెట్టాలి. ఆ ప‌ని చేస్తామ‌ని చెప్ప‌కుండా, శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్ప‌డం ఏంట‌ని శ్రీ‌వారి భ‌క్తులు నిల‌దీస్తున్నారు.

శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను ర‌ద్దు చేయ‌డం అంటే, ద‌ళారీ వ్య‌వ‌స్థ‌కు తెర‌లేప‌డం అని టీడీపీ నేత‌లు సైతం విమ‌ర్శిస్తున్నారు. కార్పొరేట్ వ్యక్తి అయిన బీఆర్ నాయుడు, తిరుమ‌ల‌లో కూడా త‌మ వ‌ర్గానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ని, ఆ దిశ‌గానే నిర్ణ‌యాలు తీసుకునేలా క‌నిపిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. శ్రీ‌వాణి ట్ర‌స్ట్‌ను ర‌ద్దు చేసి, వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల వ్యాపారం చేసుకోడానికి బీఆర్ నాయుడు వ‌చ్చీరాగానే చ‌ర్య‌లు తీసుకునేలా ఉన్నార‌ని, ఈ ధోర‌ణి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌నే భ‌యం టీడీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

తిరుమ‌ల‌లో ఎలా వుంటుంది? ఏం జ‌రుగుతోంద‌నే క‌నీస అవ‌గాహ‌న లేకుండా, నోటికొచ్చిందల్లా మాట్లాడే బీఆర్ నాయుడి వైఖ‌రితో ప్ర‌భుత్వానికి ఇబ్బంది వ‌చ్చేలా వుందని టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి వ్య‌క్తికి కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన మంత్రి లోకేశ్‌కు త్వ‌ర‌లోనే బుద్ధి వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు నిష్టూరంగా చెబుతున్నారు. ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇవ్వాలో బీఆర్ నాయుడి అనుభ‌వం చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు త్వ‌ర‌లో గుణ‌పాఠం అవుతుంద‌ని సొంత పార్టీ నాయ‌కులే చెబుతుండ‌డం విశేషం.

15 Replies to “బీఆర్‌ నాయుడితో స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు ఖాయం!”

  1. చాలా కష్టపడ్డావ్ గాని.. రెస్ట్ తీసుకో..

    నిన్నటి వరకు ఉన్నవీ లేనివీ కల్పించి రాసుకొన్నారు.. ఇప్పుడు ఏడుస్తున్నారు..

    మీ ఏడుపు మీ ప్రత్యర్థులకే ఉపయోగపడుతోంది.. ఎప్పుడు తెలుసుకొంటారో..

  2. ఇప్పటికే మూర్కుడు , నీచుడు జగన్ రెడ్డి కి వాడి కుట్ర , కుతంత్రాల , మాంత్రిక గురువు ముక్కోడికి వీడికి కట్టే ఎర్రగా కాల్చి లోపల దింపారు అది లాక్కోలేక పీక్కోలేక బెంగళూరు పాలస్ నుండి ముక్కోడి ఫేమ్ హౌస్ వరకు అగాధం ఏర్పడింది అది నేర్చుకుంటే ఇద్దరికీ గుణపాఠం లేకుంటే గునపం

  3. ఉ.చ్చ ఆగడం లేదా?

    కొన్ని రోజులు ఆగచ్చు కదా… ఈయన రావడం వైసీపీ వాళ్లకి ఇష్టం లేదు.. అందుకే పనికిమాలిన అభియోగాలు మోపితే కోర్ట్ చె.ప్పు తెగేట్టు కొట్టింది.. అయినా సి.గ్గు రాలేదు

  4. “గ‌త ఐదేళ్ల‌లో తిరుమ‌ల‌లో ఘోరాలు, నేరాలు జ‌రిగాయ‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం అందులో భాగ‌మే”…

    not true?

  5. యేసు ప్రభువు నామ జపం చేసే yv సుబ్బారెడ్డి యెక్కడ…హిందూ ధర్మాన్ని నిలబెట్టి, చానెల్ ద్వారా చాటి చెప్పిన BR NAIDU యెక్కడ

  6. బిఆర్ నాయుడు గారు సామాన్యుడు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఉచ్చపోయించాడు టివి 5 మూర్తి తో కలసి. ఇప్పుడు టీటీడీ చైర్మన్ కూడా ఇక ఆయన్ను ఆపేదెవరు. అక్రమార్కుల నరాలు నరికేట్టున్నాడు.

  7. వీళ్ళు ఉంటారు పోతారు… తిరుమల పేరుని ఆధ్యాత్మికతని నాశనం చేసి పోడానికె తయారయ్యరు..

Comments are closed.