జ‌గ‌న్ ఎమోష‌న్‌ను తీసుకెళ్ల‌లేని వైసీపీ!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల ఆస్తుల వివాదంలో వైసీపీ వాద‌న పేల‌వంగా వుంది. దీనికి కార‌ణం స‌మ‌స్య‌ను అర్థం చేసుకుని, దాన్ని జ‌నంలోకి తీసుకెళ్లే నేర్ప‌రిత‌నం లేక‌పోవ‌డ‌మే. వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య గొడ‌వ‌లో నిజానిజాలేవి…

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల ఆస్తుల వివాదంలో వైసీపీ వాద‌న పేల‌వంగా వుంది. దీనికి కార‌ణం స‌మ‌స్య‌ను అర్థం చేసుకుని, దాన్ని జ‌నంలోకి తీసుకెళ్లే నేర్ప‌రిత‌నం లేక‌పోవ‌డ‌మే. వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య గొడ‌వ‌లో నిజానిజాలేవి అనే దానికంటే, ఎమోష‌న‌ల్‌తో ముడిప‌డి వుంద‌ని వైసీపీ పీఆర్ టీమ్ గుర్తించ‌క‌పోవ‌డంతో ఆ పార్టీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగిస్తోంది.

వైఎస్ ష‌ర్మిల వాద‌న‌ను బ‌లంగా తీసుకెళ్లేందుకు టీడీపీ అనుబంధ మీడియా శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తోంది. అస‌లే ఆ మీడియా చాలా బ‌లంగా వుంది. వైసీపీ మొద‌టి నుంచి పీఆర్ విష‌యంలో చాలా బ‌ల‌హీనంగా వుంటోంది. ఆ ప‌రంప‌ర‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తోంది. స‌మ‌స్య‌ను గుర్తిస్తే, ప‌రిష్కారం ఆలోచించొచ్చు.

వైసీపీ రాజ‌కీయంగా నష్ట‌పోవ‌డానికి కార‌ణం ఏంటో గుర్తించే వ్య‌వ‌స్థ ఆ పార్టీకి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల పంప‌కం ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జాతీయ మీడియాలో కూడా జ‌గ‌న్‌కు న‌ష్టం క‌లిగించేలా డిబేట్స్ నిర్వ‌హించారు. జ‌గ‌న్‌కు న‌ష్టం క‌లిగించే ప‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చురుగ్గా జ‌రుగుతూ వుంది. మ‌రి వైసీపీ దాన్ని అడ్డుక‌ట్ట వేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటోంద‌నే ప్ర‌శ్న‌కు … ఏమీ లేద‌నే స‌మాధానం వ‌స్తోంది.

ష‌ర్మిల‌, ఆమెకు మ‌ద్ద‌తుగా విజ‌య‌మ్మ తీవ్ర భావోద్వేగాన్ని పండించారు. ష‌ర్మిల ఎమోష‌న్‌ను జ‌నంలోకి తీసుకెళ్లే ప‌నిలో టీడీపీ అనుబంధ మీడియా విజ‌య‌వంత‌మైంది. మ‌రి జ‌గ‌న్ ఎమోష‌న్‌ను జ‌నంలోకి తీసుకెళ్లే వ్య‌వ‌స్థ వైసీపీలో ఏదీ?…లేదు. అస‌లు దీన్ని ఎమోష‌న‌ల్‌గా తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న వైసీపీలో చేసేదెవ‌రు? అలాంటిది ఏమైనా వుంటే క‌దా… జ‌నంలోకి వైసీపీ త‌ర‌పున తీసుకెళ్ల‌డానికి!

కొంద‌రు స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ విశ్లేష‌కులు టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా ఓవ‌రాక్ష‌న్‌ను భ‌రించ‌లేక స్వ‌చ్ఛందంగా దాటిగా తిప్పి కొడుతున్నారు. ఇలాంటి వాళ్లే లేక‌పోతే వైఎస్ జ‌గ‌న్‌కు దిక్కే లేకుండా పోయేది. ష‌ర్మిల‌కు హ‌క్కుగా రావాల్సిన ఆస్తుల్ని పంచిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ స్వార్జిత ఆస్తుల్లో వాటా కావాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని, న్యాయం ఎవ‌రి వైపో వుందో చెప్ప‌డంతో స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు యూట్యూబ్ చానెల్స్ ద్వారా శ‌క్తిమంతంగా చెప్ప‌గ‌లిగారు.

ఈ ప‌ని చేయాల్సిందెవ‌రు? చేస్తున్న‌దెవ‌రు? అనే ప్ర‌శ్న‌కు వైసీపీ పీఆర్ వ్య‌వ‌స్థ సమాధానం చెప్పాల్సి వుంటుంది. అయ్యో పాపం … జ‌గ‌న్ వైపు న్యాయం వుండి కూడా, అన్యాయ‌మై పోతున్నాడే అని స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు క‌థ‌నాలు రాస్తున్నారు. అలాగే త‌మ సొంత యూట్యూబ్ చానెల్స్‌లో దీటైన విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. వీళ్ల శ్ర‌మంతా అంతిమంగా జ‌గ‌న్‌కు క‌లిసొస్తోంది.

జ‌గ‌న్ దుర‌దృష్టం ఏమంటే… ల‌క్ష‌ల రూపాయిలు జీతిమిస్తూ పెట్టుకున్న వాళ్లేమో, చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క పాత్ర పోషిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా లాభం పొంద‌ని వాళ్ల మేధో శ్ర‌మ‌తో జ‌గ‌న్ రాజ‌కీయంగా నిల‌బ‌డ‌గ‌లుతున్నారు. అస‌లు త‌న చుట్టూ ఏం జ‌రుగుతున్న‌దో జ‌గ‌న్ ఎప్పుడైనా ఆలోచించారా? స్వ‌చ్ఛందంగా, ధైర్యంగా టీడీపీ అనుబంధ మీడియా వికృత జ‌ర్న‌లిజంపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టుల‌తో మాట్లాడాల‌ని ఏనాడైనా జ‌గ‌న్ ఆలోచించారా?

ఇదే ప‌రిస్థితిలో చంద్ర‌బాబు వుంటే జ‌గ‌న్‌లా మౌనంగా ఉండేవారా? అంద‌ర్నీ పిలిపించుకుని, చ‌క్క‌గా మాట్లాడి ప్రోత్స‌హించేవారు. కానీ వైసీపీకి ఆ స్పృహే ఉండ‌నే వుండ‌దు. ఎందుకంటే వైసీపీకి రాజ‌కీయ ల‌క్ష‌ణాలు మ‌చ్చుకైనా లేవు. అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా న‌డుస్తూ వుంటుంది. ఆ పార్టీతో అనుబంధం ఉన్న‌వాళ్లంతా త‌మ లాభ‌న‌ష్టాల గురించి ఆలోచించ‌డ‌మే త‌ప్ప‌, దాని ఓన‌ర్ ఏమై పోతేనేం అనే స్వార్థ‌చింత‌న‌లో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు తానుగా మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నా, భ‌విష్య‌త్‌లో వెళ్లే స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టులు ఉండ‌క‌పోవ‌చ్చు.

వైఎస్ జ‌గ‌న్‌కు కొంచెమైనా సామాజిక స్పృహ ఉన్నా, వివిధ రంగాల‌కు చెందిన వ్య‌క్తులతో మాట్లాడుతూ వుండాలి. త‌న హ‌యాంలో జ‌రిగిన త‌ప్పులేంటి? ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంటి?.. తెలుసుకోవాలి. త‌మ వైపు త‌ప్పుల్ని గ్ర‌హించాలి. నాయ‌కుడ‌నే వాడే జ‌నంతో మాట్లాడ‌క‌పోవ‌డం వ‌ల్లే చెడిపోతాడు. గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ ఎప్పుడూ జ‌నంతో క‌ల‌వ‌లేదు. అందుకే భ్ర‌ష్టు పట్టాడు. ఇప్పుడు కూడా గుడ్ల కోడిపెట్ట మాదిరిగా ఇంట్లోనే వుంటాన‌ని భీష్మించుకుంటే చేయ‌గ‌లిగేదేమీ లేదు.

43 Replies to “జ‌గ‌న్ ఎమోష‌న్‌ను తీసుకెళ్ల‌లేని వైసీపీ!”

  1. క…మ్మ … నాయకులైన.. గుడివాడ నాని… వల్లభనేని… తమ వంతు డామేజీ విజయవంతంగా చేశారు… పార్టీ కి. మిగతా బాధ్యత… రోజా గారు, గుడ్డు మంత్రి గారూ… గంట అరగంట మంత్రులు, గోరంట్ల మాధవ్ గారు మొదలైన వారు సమర్ధవంతంగా పోషించారు.. డోర్ డెలివరీ వీటికి అదనం. ఇవన్నిటినీ కంట్రోల్ చేయలేని అసమర్థ అధినాయకత్వం

      1. సాయి అయితే పిల్లి మొగ్గలు వేస్తున్నాడు..

        ప్రసాద్, కొమ్మినేని అంటే ఏడుపు మొహాలు

  2. పులి ని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అంటే ఇదే చంద్ర బాబు ని చూసి నీచుడు జగన్ రెడ్డి మళ్ళీ అమాయక జనాల్ని మోసం చేయటానికి వేషం వేసుకుంటాడా సిగ్గుగా లేదు GA?

  3. GA నీ సిన్సియారిటి కి మెచ్చుకోవాలి, ఆ దద్దమ్మ గాన్ని జకీలు వేసి లేపాలని చాలా సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నారు కానీ వాస్తవం గ్రహించలేక పోతున్నారు, మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు వాడు లాటరీ సిఎం, అంతేతప్ప వాడు ఒక చేతకాని దద్దమ్మ, పరిపాలన అంటే ఏంటో తెలీని సన్నాసి. రాష్ట్రానికి పట్టిన శని పోయింది, దయచేసి వాన్ని వదిలేయండి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

  4. అదేంట్రా అయ్యా..

    మొన్నటి వరకు ప్రజలు ఇజయమ్మ ని తిడుతున్నారు.. షర్మిల ని అసహ్యించుకొంటున్నారు అని రాసుకుని.. ఈ రోజు జగన్ రెడ్డన్న గోడు ఎవడూ పట్టించుకోవట్లేదు అని మొర పెట్టుకొంటున్నావు..

    అయినా.. జగన్ రెడ్డన్న ఒక సింగల్ సింహం..

    వాడు చెప్పేది జనాలు వినరు.. వీడు జనాల మాట వినడు.. 30 అడుగుల గోడ కట్టుకుని.. లోపల జరిగేది ఎవరూ చూడటం లేదని.. భ్రమల్లో బతుకుతుంటాడు..

    వాడొక సైకోపాత్.. వాడిని వదిలేయ్.. మర్చిపో..

  5. అతి ఎప్పుడు చెడునే తీసుకు వస్తుంది అది అవినీతి సొమ్ముకి వర్తిస్తుంది
  6. ఇప్పటి వరకు ఉహాగానాలకే పరిమిత మైన ఆస్థి తగదని ..అన్న బహిరంగ పరిచాడు ట్రిబ్యునల్ కి వెళ్లి .. నేను ట్రిబునలకి వెళ్తున్నాను అని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి సలహా ఏమైనా తీసుకున్నాడా ? తన చిత్తానికి ఇంట్లో పరిష్కరించుకోవాల్సినదాని రోడ్ మీద పడేసి .. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడడం లేదు .. టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేస్తోంది అంటే ఎలా ?

    పదకొండు సీట్లతో ఓడిపోయినప్పుడు చేసుకోవాల్సిన పనులు కావు ఇవి .. తెలివిలేనోడిని నువ్వు ఎందుకు జాకీలు వేస్తావు నీకే తెలియాలి ..

    1. Tribunal ku వెళ్లకపోతే bail రద్దు కు petetion వేసేవారు.. jagan is victim and cheated by sharmila and with out informing jagan they transferred shares.. Hence je went to nclt… If morusupalli thinks that truth is on her side why can’t she go tovcourt and file a case

  7. చంద్ర బాబు మరదలు వురి వేసుకొని చనిపోతే , వైసీపీ వాళ్ళు ఏమి అన్నారు , చంద్ర బాబు వల్లే అని అన్నారు ,

    రామోజీ రావు కొడుకు సుమన్ , వాళ్ళ నాన్న తో గొడవపడితే మీరు సాక్షి టీవీ లో కురుచోపెట్టి డెబిట్ చేసారు .

    రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం బాగోలేక బయట తిరగకున్న అదే చంద్ర బాబు వల్లే ,

    లాస్ట్ కు అన్న చెల్లి ఆస్తికోసం గొడవపడుతున్న చంద్ర బాబు వల్లే.

  8. విజయమ్మ చెప్పింది 100% నిజం అని ‘బుర్ర&బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    ‘మరి మావోడికి ఆ రెండూ ‘లేవు ‘కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోని ‘తప్పు సరి చేసుకోడు. ‘తప్పు కప్పి పుచ్చుకోవడానికి ‘ఎర్రెదవ లా ఎదురు’దాడి చేసి, ఇంకో ‘పది ‘తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    ‘కరెస్ట్ గా చెప్పాను కదా జెగ్గులా

  9. ‘విజయమ్మ చెప్పింది 100% నిజం అని ‘బుర్ర&బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    ‘మరి మావోడికి ఆ రెండూ ‘లేవు ‘కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోని ‘తప్పు సరి చేసుకోడు. పెళ్ళాం మాట విని ‘తప్పు కప్పి పుచ్చుకోవడానికి ‘ఎర్రెదవ లా ఎదురు’దాడి చేసి, ఇంకో ‘పది ‘తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    ‘కరెస్ట్ గా చెప్పాను కదా జెగ్గులా??

    అందుకేరా నీపెళ్ళాం నిన్ను ‘ఉత్త ఎ’ర్రెదవ అని ముద్దుగా తిట్టేది

  10. జగన్ యూట్యూబ్ కాని సోషల్ మీడియా కాని చూసే అవకాశం లేదు, ఇక చుట్టూ ఉన్నవాళ్లు అవి చూపిస్తారా, లేదు కదా!

  11. జగన్ కాని షర్మిల కాని తమ బ్యాంకు అకౌంట్లు చెరొకటి పులివెందుల లో ఉంచారు, మిగతా అకౌంట్లన్నీ ఎలహంక, బెంగళూరు, హైదరాబాద్ ల లోనే!

  12. అదేంటి ఎంకటి పుసుక్కున అలా అనేశావు..

    మంత్ ఎండ్ పేమెంట్ పడలేదా..

    దివాళీ బోనస్ రాలేదా..

    శవాలు ఉన్నప్పుడు వస్తున్నాడుగా బయటికి..

  13. అదేంటి ఎంకటి పుసుక్కున అలా అనేశావు..

    మంత్ ఎండ్ పేమెంట్ పడలేదా..

    దివాళీ బోనస్ రాలేదా..

    శవాలు ఉన్నప్పుడు వస్తున్నాడుగా బయటికి..

  14. అదేంటి ఎంకటి పుసుక్కున అలా అనేశావు..

    మంత్ ఎండ్ పేమెంట్ పడలేదా..

    దివాళీ బోనస్ రాలేదా..

    శవాలు ఉన్నప్పుడు వస్తున్నాడుగా బయటికి..

    1. media and propoganda wise, jagan is weak? like insuting kodela with fake humiliating story, nara sura raktha charithra..and so many other examples…

      are you reincarnation of mahesh…banisa batukulu

  15. the problem with jagan he himself is not like CBN, he still wants to talk like dharmaraju . he should raise and aggressive besides find out smart strategists to counter , instead he still depends on his caste coterie

  16. గురు మూర్తి గారికి పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి పార్టీని నడపమంటే కనీసము 1 సీట్ వచ్చిద్ది 2029 లో.

    జగన్ చేతిలోనే వుంచితే గుండు సున్నా నే.

  17. ఆయన ఎమోషన్ ని వాళ్లెలా తీసుకెళ్తారు.. దోచుకున్న మంది సొమ్ముని ఎలా పంచుకోవాలి అని దొంగలు కొట్టుకుంటుంటే..

  18. జమిలి ఎన్నికలొస్తున్నాయ్.. ఇప్పుడే వైసీపీ నుండి జంప్ అయిపోయి వేరే పార్టీ లో టికెట్ కంఫర్మ్ చేసుకునేందుకు రెడీ అవుతున్న నేతలు..

    అక్కాయ్ గాడు కూడా ఈసారి గెలవడు అని అర్ధమైపోయింది

Comments are closed.