న‌మ్మ‌శ‌క్యంకాని దారుణ నిజం!

పోలీస్ వ్య‌వ‌స్థ ఎంత‌గా నిర్వీర్యం అయ్యిందో ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోడానికి ఈ ఉదంతం ప‌నికొస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అన‌గ‌న‌గా ప‌ల్నాడు జిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గం. ఆ నియోజ‌క‌వ‌ర్గం పేరు వినుకొండ‌. ఇటీవ‌ల ఈ నియోజ‌క వర్గంలో చోటు చేసుకున్న ఉదంతం గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి. వైసీపీ హ‌యాంలో మ‌ద్యం దుకాణాల్ని ప్ర‌భుత్వ‌మే న‌డిపేది. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత మ‌ద్యం పాల‌సీని మార్చింది. మ‌ద్యం వ్యాపార కిక్కును అంద‌రికీ పంచింది. దీంతో ఊరూరా, అడుగ‌డుగునా మ‌ద్యం దుకాణాలు క‌నిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కొంద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు బెల్ట్‌షాపుల‌కు మ‌ద్యాన్ని త‌ర‌లించే క్ర‌మంలో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఒక మోస్తారుగానే మ‌ద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో స‌ద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఈ విష‌యాన్ని త‌మ నాయ‌కుడి దృష్టికి వెంట‌నే తీసుకెళ్లారు. అస‌లే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన జోష్‌లో టీడీపీ నాయ‌కులున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మ ప‌రిధిలోని సీఐకి టీడీపీ నాయ‌కుడు ఫోన్ చేసి, ఏం ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నావా? లేదా? అని నిల‌దీసిన‌ట్టు తెలిసింది. వెంట‌నే స్వాధీనం చేసుకున్న మ‌ద్యం బాటిళ్ల‌ను త‌మ దుకాణానికి తీసుకెళ్లాల‌ని ఆదేశించార‌ట‌. ఆ ప‌ని చేస్తేనే సీఐగా కొన‌సాగుతావ‌ని, లేదంటే 24 గంట‌ల్లో బ‌దిలీ చేయిస్తాన‌ని హెచ్చ‌రించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అధికార పార్టీ నాయ‌కుల ఆశీస్సులు వుంటే త‌ప్ప పోస్టింగ్‌లు ద‌క్క‌ని ప‌రిస్థితి. ల‌క్ష‌ల రూపాయిలు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధికి ముట్ట‌చెప్పుకుని తెచ్చుకున్న పోస్టు కావ‌డం, త‌న‌ను హెచ్చ‌రించిన నాయ‌కుడికి ప్ర‌భుత్వంలో ప‌లుకుబ‌డి వుండ‌డంతో ఆ సీఐ వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. స‌ద‌రు టీడీపీ నాయ‌కుడి ఆదేశాల‌ను తూ.చ త‌ప్ప‌క పాటించ‌డం పోలీస్ వ‌ర్గాల్లోనూ, అలాగే ప‌ల్నాడు జిల్లాలోనూ విస్తృతమైన చ‌ర్చ‌కు దారి తీసింది. పోలీస్ వ్య‌వ‌స్థ ఎంత‌గా నిర్వీర్యం అయ్యిందో ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోడానికి ఈ ఉదంతం ప‌నికొస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

38 Replies to “న‌మ్మ‌శ‌క్యంకాని దారుణ నిజం!”

  1. టైటిల్ చూసి ..నేను ఇంకా అమరావతి ని తీసేసి
    హైదరాబాద్ ని రాజధాని ని చేస్తారేమో అనుకున్న..చూడు GA మనం చేసిన దారుణాలకంటే ఎది ఎక్కువ కాదు
    అందుకే ఎవడు పట్టించుకోవటం లేదు కనీసం ప్రెస్ మీట్ పెట్టే దిక్కు లేదు
  2. ఆ హెడ్ లైన్ ఏంట్రా బాబు.. ఏదో చాలా పెద్ద వార్త అనుకున్నాం..

    ఆఫ్ట్రాల్ ఒక ci ఇష్యూనా. ఇలాంటివి మన టైమ్ లో స్టేషనుకు ఒకటి..

  3. ఎక్కడో ముంబాయి లో హీరో ఇన్. ప్రకాశం లో భూమి కబ్జా చసింది అది పట్టుకోడానికి ముగ్గురు S P స్థాయి వ్యక్తులు పనులన్నీ మానుకొని. ముంబాయి ఫ్లైట్ ఎక్కి వెళ్లి మరీ తీసుకొచ్చారు .ఈ అయిదేళ్లలో జరిగినవి అలాంటి ఇది ఆఫ్ట్రాల్ మద్యం బాటిల్స్ .

  4. పొలీసు వ్యవస్త ఎంత నిర్వీయం అయ్యిందొ చెప్పె గొప్ప ఉదాహరణలు RRR మీద పొలీసుల 3rd డిగ్రీ, కాదంబరి జత్వాని అక్రమ అర్రెస్ట్లు. వీటిని ఖండిస్తూ ఎప్పుడూ GA రాస్తింది లెదు.

    .

    పొలీసులని తప్పు పట్టకపొగా…. అయ్యో, అమ్మొ అనెలా RRR ని కొట్టారు అని రాస్తూ, జగన్ తొ పెట్టుకుంటె ఇలా ఉంటుంది అని గొప్పలు పొయాడు GA.

    .

    ఇక కాదంబరి కెసు లొ పొలెసులె Y.-.C.-.P నాయకుడితొ కలిసి అక్రమ పత్రాలు స్రుష్టించి మరి అర్రెస్త్ చెస్తె, ఎనాడు అన్న కనీసం ఖండించావా GA గురువిందా?

    1. మీడియా లో రాయనత మాత్రానా ఎవరికి తెలియదు అనొకవడం అవివేకం . అందుకే ప్రజలు 11 తో కొట్టారు

  5. నాశనం చేయటం జగ్గు మొదలు పెట్టినపుడు కదా ఏడవల్సింది..ఇప్పుడేమి లాభం..మీరు చేసిందే వాళ్ళు చేస్తారు..నువ్వు వెబ్మెడియా ఆపేసి ఇంకా బజ్జీలు అమ్ముకో..

  6. మానాకెందుకు ga, బజ్జీలు అమ్ముకుందాం పా..అన్నీయ ను నమ్మినోళ్ళంత అవే అమ్ముకుంటున్నారు ఇప్పుడు

  7. Bihar better అనిపిస్తున్నారు..ఎంతకు దిగజారారురా…unlike last 3 term, 4th term looks worst with so far incidents that came to light. ఇంకెన్ని చేస్తున్నారో…

  8. ఈ వార్తలో నిజం ఉందే అనుకున్నాము. మరి ఆ CI ఏమాశించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ అ పోస్ట్ లోకి వచ్చినట్లు?! అక్రమ సంపాదనకి కక్కూర్తి పడితే రాజకీయనాయకులకు అలుసే అవుతారు కదా? వాళ్ళుకూడా ఇలాంటివాళ్ళ దగ్గర advantage తీసుకుంటారు!

  9. లక్షలు ముట్టచెప్పి తెచ్చుకున్న పోస్టు… సీఐ పోస్టింగ్ తెచ్చుకుని ఎన్నిరోజులైందిరాGAండుగాచెప్పురా… వాడుజగ్గులుమామయ్యకుకప్పంకట్టితెచ్చుకున్నపోస్టనిఎంతబాగాచెప్తున్నావురాలంబ్డీకే…

Comments are closed.