బ్యాంక్ లో పని చేస్తూ తెలివిగా బ్యాంక్ డబ్బును అవసరాలకు ఎలా వాడుకున్నాడో చూపిస్తూ తీసిన సినిమా లక్కీ భాస్కర్. అయితే లక్కీ భాస్కర్ బ్యాంక్ డబ్బులు కాజేయలేదు. బ్యాంక్ డబ్బులను వేరే వాళ్లు వాడుకున్నందుకు సహకరించి డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ టాలీవుడ్ లోనూ కొందరు లక్కీ భాస్కర్లు వున్నారు. వీళ్లు అలా కాదు. పని చేస్తున్న సంస్థల డబ్బులే గుటకాయి స్వాహా అంటున్నారు.
టాలీవుడ్ లో ఓ సంస్థ వుంది. అది ఇప్పుడు రెండో సినిమా తీస్తోంది. సినిమా రంగానికి చెందిన ఓ సెలబ్రిటీ రికమెండేషన్ తో ఒకరిని దగ్గరకు తీసి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మూడు.. నాలుగు కోట్ల వరకు తేడా చేసినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి, అకౌంటెంట్ కలిసిపోయి ఈ దందా నడించారని టాక్. తీరా బయటకు వచ్చేసరికి తప్పు తనది కాదు అకౌంటెంట్ దే అని అంటున్నట్లు తెలుస్తోంది. అసలే మొదటి సినిమా భాగస్వామ్యంలో తీసి, హమ్మయ్య గట్టెక్కాం అనుకున్నారు. రెండో సినిమా తీస్తూ, ఫండ్స్ కోసం కిందా మీదా అవుతున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్న నిర్మాతపై ఈ స్కాము భారం మరి కొంత అన్నమాట.
ఇంకో బడా సంస్థ వుంది. ఆ సంస్థ తరచు ఓ కంపెనీకి చెక్కులు ఇస్తూ వుంటుంది. అక్కడ పని చేసే ఆసామీ ఇది కనిపెట్టి, ఓ డూప్లీకేట్ అక్కౌంట్ ను ఓపెన్ చేసి, ఈ కంపెనీకి వెళ్లాల్సిన పేమెంట్లు, ఆ డూప్లికేట్ కంపెనీకి వెళ్లేలా చేసాడు. ఇది గమనించుకునేసరికి ఈ డూప్లికేట్ కంపెనీకి రెండు కోట్లకు పైగా పేమెంట్లు వెళ్లిపోయాయి. అయితే కంపెనీ ఓనర్ గట్టివాడు కనుక, పట్టుకుని, వెనక్కు రాబట్టుకునే పనిలో వున్నారు.
గతంలో ఇలాగే ఓ నిర్మాత దగ్గర పని చేస్తున్న ఇద్దరు లక్కీ భాస్కర్లు గట్టిగా వెనక్కు వేసారు. దాంతో బెజవాడ రౌడీలను రప్పించి, ఎలా డీల్ చేయాలో అలా చేసి, చాలా వరకు ఆస్తులు లాక్కున్నారు.
Call boy jobs available 9989793850
రేయ్..బాబూ..ఇది కూడా సినిమా “కవర్” కోసమేనా..?
vc available 9380537747
vc available 9380537747
vc estanu 9380537747
Ila rasi GA kuda lagetadu lagundi.
Veedu kuda oka bhaskare