సిగ్గేయ‌డంలేదా ‘పుడింగి’?

కూట‌మి స‌ర్కార్ టీటీడీ బోర్డు ఏర్పాటు చేసింది. చైర్మ‌న్‌గా ఒక ఛానెల్ అధిప‌తి బీఆర్ నాయుడు, అలాగే 24 మంది స‌భ్యుల‌తో కూడిన బోర్డును అధికారికంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. స‌భ్యుల్లో ఎవ‌రెవ‌రు ఎలాంటి వాళ్లు?…

కూట‌మి స‌ర్కార్ టీటీడీ బోర్డు ఏర్పాటు చేసింది. చైర్మ‌న్‌గా ఒక ఛానెల్ అధిప‌తి బీఆర్ నాయుడు, అలాగే 24 మంది స‌భ్యుల‌తో కూడిన బోర్డును అధికారికంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. స‌భ్యుల్లో ఎవ‌రెవ‌రు ఎలాంటి వాళ్లు? టీటీడీ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌భ్యుల్ని నియ‌మించారా? లేదా? అనేది ప్ర‌తిప‌క్ష పార్టీ చూసుకోవాల్సి వుంటుంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నేర చ‌రిత్ర క‌లిగిన వాళ్ల‌కు టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వం క‌ల్పించి వుంటే, ఆ వివ‌రాల్ని అనుకూల సోష‌ల్ మీడియా, అలాగే ప్ర‌ధాన న్యూస్ ఛానెళ్ల‌కు, ప‌త్రిక‌ల‌కు అందించాల్సి వుంటుంది.

వైసీపీ లేదా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి చీఫ్ పీఆర్వోగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే వ్య‌క్తి ఇవ‌న్నీ చూసుకోవాలి. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి చీఫ్ పీఆర్వోగా పూడి శ్రీ‌హ‌రి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో ఈయ‌న సీఎంవో చీఫ్ పీఆర్వో. వైసీపీ అధికారం కోల్పోవ‌డంతో పూడి శ్రీ‌హ‌రి ఆ పార్టీలో కీల‌క‌మ‌య్యారు. దీన్నిబ‌ట్టి ఆ పార్టీ ఏ స్థాయికి దిగ‌జారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈయ‌న గారు చెబితే వైసీపీ నేత‌లు నోరు తెర‌వాలి. సార్ పంపిన విష‌యాల్నే చెప్పాలి.

కూట‌మి స‌ర్కార్ పరిపాల‌న ప‌రంగా విఫ‌ల‌మ‌వుతూ, వ్య‌తిరేక టాక్ తెచ్చుకుంటున్న నేప‌థ్యంలో వైసీపీ చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. కూట‌మి నిర్ణ‌యాల్లోని లోపాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నానికి తెలియ‌జేస్తూ, త‌ద్వారా రాజ‌కీయంగా ల‌బ్ధి పొందే అవ‌కాశం వుంది. కానీ ఆ ప‌ని జ‌రుగుతోందా? అంటే… లేనే లేద‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు టీటీడీ బోర్డుపై వివాదం త‌లెత్తింది. ప్ర‌ముఖ లాయ‌ర్‌, జైభీమ్ భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ శుక్ర‌వారం మీడియా ముందుకొచ్చి బోర్డు స‌భ్యుల్లో ఎవ‌రెవ‌రికి ఎలాంటి నేర చ‌రిత్ర వుందో వివ‌రాలు వెల్ల‌డించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజుల‌కు సంబంధించి నేర వివ‌రాల‌ను ఆయ‌న చ‌దివి వినిపించారు.

అలాగే జోక‌ర్ అయిన న‌ర్సిరెడ్డికి, చంద్ర‌బాబునాయుడు రాజ‌మండ్రి జైల్లో ఉన్న‌ప్పుడు భువ‌నేశ్వ‌రికి క్యారీ చేయించిన, వాళ్ల మ‌న‌వ‌డు దేవాన్ష్‌కు చొక్కా తొడిగిన కార్య‌క‌ర్త‌కు టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వం క‌ల్పించ‌డం ఏంట‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ నిల‌దీశారు. ఇలాంటి ప్ర‌శ్న‌లు భ‌క్తుల్లో ఒక ఆలోచ‌న‌ను క‌లిగిస్తాయి. ఇలాంటి వాళ్లంద‌రికీ ప‌ర‌మ ప‌విత్ర‌మైన టీటీడీలో చంద్ర‌బాబు ఎలా స్థానం క‌ల్పిస్తార‌నే ఆలోచ‌న కోట్లాది మంది హిందూ భ‌క్తుల్లో త‌ప్ప‌క క‌లుగుతుంది.

అలాగే గుజ‌రాత్‌కు చెందిన శ‌వాలు అమ్ముకునే డాక్ట‌ర్ కుమారుడికి బీజేపీ సిఫార్సుతో టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వం ఎలా క‌ల్పిస్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. ప‌చ్చి బూతులు మాట్లాడే ఎంఎస్ రాజు, అలాగే తెలంగాణ టీడీపీ నాయ‌కుడు న‌ర్సిరెడ్డి గ‌తంలో శ్రీ‌వారి దంప‌తుల‌ను జ‌గ‌న్‌ను హేళ‌న చేయ‌డానికి వాడుకున్న వైనాన్ని వాళ్ల వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించి జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ ఎండ‌గ‌ట్టారు.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డులో ఎలాంటి వాళ్లుండాలి? ఎలాంటి వాళ్లు వుండ‌కూడ‌ద‌నే విష‌య‌మై చ‌ట్టం ఏం చెప్పిందో జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ వివ‌రించారు. ఈ చ‌ట్ట ప్ర‌కారం ప్ర‌భుత్వం నియ‌మించిన స‌భ్యుల్లో ఎంత మందికి అర్హ‌త వుందో పునాలోచ‌న చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఆధ్యాత్మిక‌త‌ను ప‌రిర‌క్షించే ఒక్క వ్య‌క్తి కూడా లేర‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. హిందూ ధ‌ర్మాన్ని కాపాడాల‌ని అనుకునే వాళ్లంతా బోర్డు ఏర్పాటుపై ఆలోచించాలని ఆయ‌న వేడుకున్నారు. ఈ బోర్డులో నేర చ‌రిత్ర క‌లిగి ఉన్న వాళ్ల‌పై హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌నం వ్యాజ్యం వేస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్ కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశం కావ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

అయితే రాజ‌కీయంగా శ‌క్తిమంత‌మైన వైసీపీ చేయాల్సిన ప‌నిని, ఒక వ్య‌క్తి చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వైసీపీకి ఒక వ్య‌వ‌స్థ లేదా? జై భీమ్ భార‌త్ అనే పార్టీ పెట్టుకుని, కూట‌మి స‌ర్కార్ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నారు. కూట‌మి స‌ర్కార్ భ‌య‌ప‌డాల్సింది వైసీపీకి క‌దా? మ‌రెందుకు అలా జ‌ర‌గ‌డం లేదు. ఎందుకంటే, వైసీపీలో విష‌య ప‌రిజ్ఞానం ఉన్న వాళ్లు లేర‌ని జ‌డ శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించిన వివ‌రాలు తెలియ‌జేస్తున్నాయి.

టీటీడీ బోర్డు ఏర్పాటు కాగానే, జ‌గ‌న్ చీఫ్ పీఆర్వో చేయాల్సిన ప‌నేంటి? చేసిందేంటి?. జ‌డ శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించిన వివ‌రాల్ని వైసీపీ వాళ్లు మీడియాకు చెప్పాల్సింది. పూడి శ్రీ‌హ‌రి ప్ర‌తి మీడియా సంస్థ‌కు టీటీడీలో నేర చ‌రిత్ర క‌లిగిన స‌భ్యుల వివ‌రాల్ని పంపి వుండాలి. కానీ ఆ ప‌ని త‌న‌ది కాద‌ని పుడింగి అలియాస్ పూడి శ్రీ‌హ‌రి భావించిన‌ట్టున్నార‌నే విమ‌ర్శ వైసీపీ నుంచి వ‌స్తోంది.

తాను చేయాల్సిన ప‌ని, మ‌రెవ‌రో చేస్తూ, వాటిని వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేసుకోవాల్సి వ‌చ్చినందుకు చీఫ్ పీఆర్వోగా శ్రీ‌హ‌రికి సిగ్గుగా లేదా? అనే ప్ర‌శ్ని ఉత్ప‌న్న‌మైంది. ఈయ‌న గారికి చీఫ్ పీఆర్వో ఉద్యోగం కావాలి. అంతే త‌ప్ప‌, శ్రీ‌హ‌రి వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్‌కు, ఆయ‌న పార్టీకి రూపాయి ప్ర‌యోజ‌నం కూడా లేదనే చ‌ర్చ ఆ పార్టీలో మొద‌లైంది.

మొహమాటానికి పోతే వితంతువు యాకటి అయ్యిందనే మొర‌టు సామెత క‌డ‌ప‌లో వుంది. శ్రీ‌హ‌రి లాంటి వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన వైఎస్ జగన్ ప‌రిస్థితి కూడా మొర‌టు సామెత మాదిరిగా త‌యారైంది. జ‌గ‌న్‌ను ఏ శ్రీ‌హ‌రి కాపాడాలో మ‌రి!

సొదుం ర‌మ‌ణ‌

25 Replies to “సిగ్గేయ‌డంలేదా ‘పుడింగి’?”

  1. పాపం పుడింగి గాడు సోదిరమణ ను సాచ్చి నుండి ఎప్పుడో వెళ్లగొట్టిన కసి ఉండి రాసినట్లున్నాడు.అసలు వైకాపాలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఏడ్చిందంట్రా?

  2. అయ్యొ! జగన్ సమయంలొ TTD లొ అందరూ శ్రిరామ చంద్రులె! ఇక జగన్ మీద కూడా ఎ కె.-.సులు లెవు!

    .

    ఎవరినా సరె TDP, Janasena ని విమర్సిస్తె చాలు ఇక్కడ వెస్తాడు. లెకపొతె ఈయన వార్త ఎప్పటికి వెయాలి! ఇంతకు ముందు ఎన్నొ సార్లు ఈయన జగన్ ని విమర్సించాడు. ఇక్కడ GA వెసాడా?

  3. కంఠ శోష తప్ప మన జగ్గడు వినేరకమా?మారేరకమా?? మూసుకోరా అర్ధ పుడింగి.

  4. ///హిందు దర్మాన్ని రక్షించె వారు ఎవరూ లెరు///

    .

    అందుకెనా క్రిస్టియన్ వివాహ పద్దతులలొ కూతురి పెళ్ళి చెసిన భూమన కి TDD బొర్డు ప్రెసిదెంట్ పదవి ఇచ్చారు మన జగన్ అన్న! ఇక సుబ్బరెడ్డి బార్య బైబిల్ చెతిలొ పట్తుకు తిరెగె ఫొటొలు ఉండనె ఉన్నయి.

  5. ఆ Cheif PRO శ్రిహరికి కీ GA గాడికి పడుతునట్టు లెదు. అందుకె ఆ శ్రిహరి ని అన్నిటికీ బాద్యుడని చెస్తూ తెగ నెగటివెగా రాస్టున్నాడు!

    .

    పొని నీకె ఆ పదవి చెయలి అని ఉంటె అదె నెరుగా చెప్పు!

  6. సోదుమ్ బాబు, వాడ్ని ఎవరూ కపాడలేరు ఎందుకంటే వాడు రాజకీయ పార్టీ తో బిజినెస్ చేసేవాడు, నీకు GA కు ఈ విషయం మీరు పోయేదాకా కూడా అర్థం కాదు..వాడ్ని నమ్మి మేము అందరం కుడిసిపోయం..మీరు పోతారు..కొంచం లేట్ అంతే.. wait chey

  7. ఇది అంత మంచిది కాదు GA… అన్నీ నాకే తెలుసు అనుకోవడం, ఏదో తెలియలేదని వాళ్లని పుడింగి అని ఎంత మాట వస్తే అంత అనడం. మనకి తెలియాల్సింది ఏమిటంటే, ఎవరి దారులు వాళ్ళకి ఉంటాయి.

    ఈ విషయంలో అన్నకి నీకు తేడా ఏమి లేదు, అన్న కూడా ఇలా అందరి నాయకుల మీద ఏది పడితే అది మాట్లాడి ఇలా కిందకి దిగి పోయాడు, నువ్వు కూడా జాగ్రత్త మరి.

  8. GA తట్టుకోలేక పోతుంది ఒక non-cheddy జగన్ కి సలహాదారుడు ఏంటి , మన చెడ్డిల్లో లేరా అని. మరీ అంత చిన్న చూపు ఏంటి వేరే కులాలు అంటే GA ఎంకటి.

  9. మొహమాటానికి పోతే వితంతువు యాకటి అయ్యిందనే మొర‌టు సామెత క‌డ‌ప‌లో వుంది — లాస్ట్ లైన్ లో ఇది కడప లో నీచుడు జగన్ రెడ్డి తల్లి గురుంచి రాసిందేగా ??

  10. మరో వైసీపీ కీలక నేతపై లైంగిక ఆరోపణలు.. వాడుకుని వదిలేశాడంటూ

    వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గరే రూ.90 లక్షలు కాజేసి ఇప్పుడు మొహం చాటేశాడంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.

    .

    ఈ వార్త రాయవా GA పుడ్డింగి!!

  11. ఇతన్ని అప్పోయింట్ చేసుకున్నోడికి ఎంత సిగ్గుండాలి ఇతని సిగ్గుండాలి అనేముందు..

  12. ఆధ్యాత్మికతను పరిరక్షించే ఒక్క వ్యక్తి కూడా లేరని ఆయన “తేల్చి”చెప్పారు..తేల్చి చెప్పడానికి ఆయనెవరు, ఆయనకున్న అర్హత ఏంటి ? 

    ఏబీఎన్ ఛానల్ డిస్కషన్స్ లో కూర్చున్నప్పుడు కోటు వేసుకొచ్చి కూర్చింటాడొకడు అని అప్పట్లో మీ లెవెనోడీ ఛానల్ కామెడీ చేసింది ఈ కోటు గురించే..

  13. మనిషి అన్నాకా కోపాలు తాపాలు లోపాలు.. కామ క్రోధ లోభాలు.. మధ మాత్సర్యాలు.. సహజం.. అట్టి వాటి గూర్చి చింత తగదు…

  14. మనిషి అన్నాకా కోపాలు తాపాలు లోపాలు.. కా మ క్రోధ లోభాలు.. మధ మాత్సర్యాలు.. సహజం.. అట్టి వాటి గూర్చి చింతించుట తగదు…

Comments are closed.