సస్పెన్స్ కు తెరపడింది. సంక్రాంతి బరిలోకి మరో మూవీ వచ్చి చేరింది. వెంకటేశ్, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతికే వస్తోంది. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
టైటిల్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెనక క్రైమ్ సీన్ ను వివరిస్తూ బోర్డ్ ఉంది. దాని ముందు లుంగీ కట్టుకొని, భుజాన తుపాకీ వేసుకొని వెంకీ నిలబడ్డారు. చెరోవైపు హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరిని నిలబెట్టారు.
ఈ సినిమాతో సంక్రాంతికి దిల్ రాజు నుంచి 2 సినిమాలు రాబోతున్న విషయం స్పష్టమైంది. మూడేళ్లుగా నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ను కూడా ఆయన సంక్రాంతికే తీసుకొస్తున్నారు. ఇప్పుడు వెంకీ సినిమాను కూడా సంక్రాంతికే షెడ్యూల్ చేస్తున్నట్టు ప్రకటించారు.
గేమ్ ఛేంజర్ జనవరి 10న రాబోతోంది. ఆ సినిమాకు ముందే వెంకీ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను విడుదల చేస్తారా లేక ఆ సినిమా వచ్చిన 2 రోజుల గ్యాప్ లో రిలీజ్ చేస్తారా అనేది డౌట్. ఎందుకంటే, మధ్యలో బాలకృష్ణ సినిమా కూడా ఉంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈసారి చరణ్, వెంకీ, బాలయ్య సినిమాల మధ్య రెండేసి రోజుల గ్యాప్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అటు సందీప్ కిషన్ చేస్తున్న ‘మజాకా’ మూవీని వీటన్నింటికంటే బాగా ముందు లేదా బాగా ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ తేదీల సంగతి పక్కనపెడితే, సంక్రాంతి సినిమాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్టయింది.
Call boy jobs available 9989793850
vc estanu 9380537747