ఏపీలో మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌!

ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ చేసిన ప్ర‌చారంలో ప్ర‌ముఖంగా మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు కూడా ఒక‌టి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థకాల‌తో పాటు ఇత‌రత్రా హామీల అమ‌లు కోసం జ‌నం…

ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ చేసిన ప్ర‌చారంలో ప్ర‌ముఖంగా మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు కూడా ఒక‌టి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థకాల‌తో పాటు ఇత‌రత్రా హామీల అమ‌లు కోసం జ‌నం ఎదురు చూస్తున్నారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కోసం మ‌హిళ‌లు ఎప్పుడెప్పుడా అని ఉన్నారు.

అయితే ఏపీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై స‌ర్కార్ ఆస‌క్తిగా లేన‌ట్టు తెలిసింది. ఈ ప‌థ‌కానికి స్వ‌స్తి చెప్పాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై ఏపీ ర‌వాణాశాఖ అధికారులు ఇప్ప‌టికే తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి అధ్య‌య‌నం చేశారు. అయితే ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై ఆ రాష్ట్రాల అధికారులు అనాస‌క్తి చూపిన‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క‌లో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తాజాగా కీల‌క కామెంట్స్ చేశారు. ఈ స‌దుపాయాన్ని స‌మీక్షిస్తామ‌ని ఆయ‌న అన్నారు. టికెట్లు కొనుక్కోడానికి కొంద‌రు మ‌హిళ‌లు ఆస‌క్తి చూపుతున్నార‌ని, అందుకే ఉచిత బ‌స్సు ప్ర‌యాణ స‌దుపాయాన్ని కొన‌సాగించాలా? లేదా? అనే విష‌య‌మై సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ విష‌య‌మై ర‌వాణాశాఖ మంత్రి రామ‌లింగారెడ్డితో చ‌ర్చిస్తామ‌ని డీకే శివ‌కుమార్ అన్నారు.

ప‌క్క రాష్ట్రాల్లో ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణంపై సందిగ్ధం నెల‌కున‌డంతో ఏపీలో ఎందుకు అమ‌లు చేయాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ ఉన్న‌ట్టు ర‌వాణాశాఖ ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. అందుకే ప‌థ‌కాన్ని మ‌హిళ‌లే మ‌రిచిపోయేలా ప్ర‌భుత్వం జాప్యం చేస్తున్న‌ట్టుగా ర‌వాణాశాఖ అధికారులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

10 Replies to “ఏపీలో మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌!”

  1. బెటర్ ఇప్పుడు ఏ వారు రూపాయి కి పవల కి ఆలోచించడం లేదు. నిజంగా కూటమి కి ఉచితాల కోసం అయితే వెయ్యనే లేదు .అభివృద్ధి చెయ్యండి చాలు ఉచితాలు కోసం అయితే జగన్ కి వేస్తారు

  2. పల్లె వెలుగు, వితిన్ స్టేట్ ఎక్ష్ప్రెస్స్ లకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలి. హామీ కాబట్టి చెయ్యాలి, వెనుకంజ వెయ్యకూడదు.

  3. అన్ని బస్సు లు కాకుండా 15 % బస్సు లను ఉచిత బస్సు పథకానికి కేటాయిస్తే మంచిది

Comments are closed.