అక్టోబర్ బాక్సాఫీస్.. రిజల్ట్ పెండింగ్!

అక్టోబర్ నెలలో 30 సినిమాలు రిలీజ్ అవ్వగా, 31వ తేదీ వరకు ఒక్క హిట్ కూడా లేదు.

అక్టోబర్ అంటేనే టాలీవుడ్ కు కలిసిరాని నెలగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నెలలో ఊహించే హిట్స్ కంటే, ఊహించని ఫ్లాపులే ఎక్కువ. గడిచిన మూడేళ్లుగా ఇదే ఆనవాయితీ. గతేడాది అక్టోబర్ నెలలో మాత్రం చెప్పుకోవడానికి భగవంత్ కేసరి ఉంది. ఈ అక్టోబర్ లో మాత్రం ఇంకా సక్సెస్ వీడలేదు. 2 సినిమాల రిజల్ట్ మాత్రం పెండింగ్ లో ఉంది.

సెప్టెంబర్ నెలాఖరులో విడుదలైన దేవర సినిమా హవానే అక్టోబర్ మొదటి వారంలో కూడా కొనసాగింది. ఈ హవాకు తోడు, కంటెంట్ లో కామెడీ పండకపోవడంతో శ్వాగ్ సినిమా మెరవలేకపోయింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో కామెడీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఈ సినిమాతో పాటు వచ్చిన మిస్టర్ సెలబ్రిటీ, బహిర్భూతి, కలి లాంటి చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇక దసరా వీక్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలేవీ క్లిక్ అవ్వలేదు. వైట్ల ఈసారి ఏదో ఒకటి చేస్తాడని భావించిన ప్రేక్షకులకు విశ్వంతో మరోసారి నిరాశే ఎదురైంది. దర్శకుడు శ్రీనువైట్ల, హీరో గోపీచంద్ ఆశించిన రిజల్ట్ ను ఈ సినిమా అందించలేదు. దీంతో శరవేగంగా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా.

ఇక ‘జనక అయితే గనక’ సినిమా అయితే ప్రచారంతో ఊదరగొట్టింది. ఈ మూవీ తనకు మరో ‘బలగం’ అవుతుందని ఆశించి భంగపడ్డాడు దిల్ రాజు. ‘మా నాన్న సూపర్ హీరో’ అంటూ వచ్చిన సుధీర్ బాబుకు ప్రశంసలు దక్కాయి కానీ కలెక్షన్లు దక్కలేదు.

ఉన్నంతలో ఈ దసరాకి ‘వేట్టయన్’ సినిమానే బెటర్. టైటిల్ అర్థం కాకపోయినా జనం థియేటర్లకు వచ్చారు. అలా అని ఇదేదో హిట్ అనుకోవడానికి లేదు, ఆడిందంతే. జిగ్రా, మార్టిన్ గురించి మాట్లాడుకోవడానికేం లేదు.

దసరా సినిమాల సంగతి తేలిపోవడంతో, ఆ మరుసటి వారం చిన్న సినిమాలు క్యూ కట్టాయి. పెద్దగా ప్రచారం లేకుండానే దాదాపు అరడజను సినిమాలొచ్చాయి. ఏదీ నిలబడలేదు. ఇందులో కృష్ణవంశీ తీసిన ఖడ్గం రీ-రిలీజ్ కూడా ఉంది.

చివరి వారం పొట్టేల్ కాస్త హడావుడి చేసింది. వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంది. దీనికితోడు కాస్టింగ్ కౌచ్ పై అనన్య ఫీలైన విధానం కొంతమందిని సినిమా వైపు లాగింది. కానీ సినిమా సేఫ్ వెంచర్ కాలేకపోయింది. శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మీడియా పూర్తిగా ఈ సినిమాను పక్కనపెట్టింది. అలా పొట్టేల్ ఖతం అయింది.

దీంతో పాటు వచ్చిన మరో అరడజను సినిమాల్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే రీ-రిలీజ్ కేటగిరీ కింద వచ్చిన ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’ మాత్రం కొన్ని థియేటర్లలో మెరిసింది. ప్రభాస్ స్టార్ డమ్ ఈ రీ-రిలీజ్ కు కలిసొచ్చింది. కాకపోతే కొన్ని స్క్రీన్స్, షోలకు మాత్రమే ఇది పరిమితం.

ఇక అక్టోబర్ నెల చివరి రోజున దీపావళి కానుకగా 4 సినిమాలొచ్చాయి. వీటిలో 3 సినిమాలు అంచనాల మధ్య వచ్చాయి. అందులో 2 సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఒకటి లక్కీ భాస్కర్ కాగా, రెండోది ‘క’ సినిమా. ఈ రెండు సినిమాలతో పాటు అమరన్, భగీర సినిమాలొచ్చాయి.

వీటితో భగీర సినిమాను ఆడియన్స్ పట్టించుకోలేదు. సాయిపల్లవి కారణంగా అమరన్ పై కొందర్లో ఆసక్తి ఉంది. ఈ సినిమాతో పాటు లక్కీ భాస్కర్, ‘క’ మూవీస్ పై ప్రస్తుతం పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. ఈ రివ్యూలకు ప్రేక్షకుల పాజిటివ్ టాక్ కూడా కలిస్తేనే సినిమా హిట్టవుతుంది. ఏ విషయం మరో 2 రోజుల్లో తేలిపోతుంది.

ఓవరాల్ గా, అక్టోబర్ నెలలో 30 సినిమాలు రిలీజ్ అవ్వగా, 31వ తేదీ వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీపావళి సినిమాల్లో ఏదైనా క్లిక్ అయితే అక్టోబర్ బాక్సాఫీస్ ఖాతాలో సక్సెస్ పడుతుంది. ప్రస్తుతానికి రిజల్ట్ పెండింగ్.

6 Replies to “అక్టోబర్ బాక్సాఫీస్.. రిజల్ట్ పెండింగ్!”

  1. లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్

    ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు

    నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్

    ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు

    నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన

    ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని

    ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

    తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులం తా తీవ్ర

    మానసిక వేదనకు గురైన నేపథ్యం లో.. తాజాగా వెలువడిన

    ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చిం ది. మతపరమైన

    ప్రదేశాల్లోప్రసాదాల నాణ్య త కచ్చి తం గా ఉం డాలనే

    అం శాన్ని నొక్కి చెప్ప డం కోసం ఈ పని చేసిం ది ఇం డియా

    టుడే

    1. థాంక్స్ రా ఎర్రిపప్ప..

      కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ లడ్డు క్వాలిటీ బాగు పడిందని.. టెస్టులు చేసి మరీ ప్రచారం చేస్తున్నారు..

Comments are closed.