పాద‌యాత్ర‌కు కేటీఆర్ రెడీ

తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌… మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం…

తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌… మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఎక్స్ వేదిక‌గా నిర్వ‌హించిన ‘ఆస్క్‌ కేటీఆర్‌’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆయ‌న‌ సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేత‌లు ప్ర‌భుత్వాల అప్ర‌జాస్వామిక వ్య‌తిరేక విధానాల్ని తిప్పికొట్ట‌డంతో పాటు త‌మ పార్టీల‌ను బ‌లోపేతం చేసుకునేందుకు సంబంధిత అధ్య‌క్షులు పాద‌యాత్రలు చేస్తున్నార‌ని, మీరెప్పుడు చేస్తార‌నే ప్ర‌శ్న కేటీఆర్‌కు ఎదురైంది.

బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల కోరిక కూడా అదేన‌ని, త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తాన‌ని కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ‌లో గ‌త ప‌దినెల‌ల కాలంలో కాంగ్రెస్ స‌ర్కార్ చేసిన ఒక మంచి ప‌ని కూడా గుర్తుకు రావ‌డం లేద‌న్నారు. అబ‌ద్ధ‌పు హామీలతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత‌కంటే మంచి పాల‌న అందిస్తుంద‌ని ఆశించ‌లేమ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ‌కు కాంగ్రెస్ పాల‌న శాపంగా మారింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

కాంగ్రెస్ పాల‌న‌తో జ‌రుగుతున్న న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డం ఇప్పుడిప్పుడే సాధ్యం కాద‌ని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐదేళ్ల పాటు ప‌దవిలో కొన‌సాగుతారా? లేదా? ఓటుకు నోటు కేసు భ‌యంతో బీజేపీలోకి వెళ్తాడా? అనే ప్ర‌శ్న‌కు… రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. రెండు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో త‌న కుటుంబ స‌భ్యుల్ని అవ‌హేళ‌న చేసి మాట్లాడిన‌ప్పుడు రాజ‌కీయాలు వ‌దిలేయాల‌న్నంత విర‌క్తి క‌లిగింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

13 Replies to “పాద‌యాత్ర‌కు కేటీఆర్ రెడీ”

  1. డ్రామా రావు గాడు పిత్తుకుంటూ , పంది పెంట లా ఉండే తెలంగాణ భగారా తో దావత్ చేసుకుంటూ కల్లు తాగి , డ్రగ్స్ అమ్ముకుంటూ వీడు చేసి గబ్బు యాత్ర ఎవడికి లాభం రా బత్తేబాజ్ బేవకూఫ్ బఫున్ సాలా

  2. ఇటువంటి యాత్రలు ఉంటేనే.. అప్పుడైనా అధికార పార్టీ వాళ్లకి వాళ్లు ఇచ్చిన వాగ్దానాలు గుర్తుకు వస్తాయి

  3. చెయ్యరా సామి ..ఇప్పుడస్తున్న కొత్త కొత్త హిరొయిన్ లకు నువ్వు ఎవరొ తెలియట్లెదు….

    మళ్ళి సినిమా ఫంక్షన్స్ కెళ్ళి బిల్డప్ ఇవ్వాలంటె అమాత్రం కష్టపడాలి కదా దొరా ?

  4. చెయ్యరా సామి ..ఇప్పుడస్తున్న కొత్త కొత్త హిరొయిన్ లకు నువ్వు ఎవరొ తెలియట్లెదు……

    మళ్ళి సినిమా ఫంక్షన్స్ కెళ్ళి బిల్డప్ ఇవ్వాలంటె అమాత్రం కష్టపడాలి కదా దొరా ?

    మా రాష్ట్రం లొ వుండె సైకొ గాడి సలహాలు కూడా తీసుకొ

  5. అన్నా..మనది జాతీయ పార్టీ..దేశ వ్యాప్తంగా పాదయాత్ర /ప్రచారం చెయ్యాలి గదే

Comments are closed.