కూతురు పేరు బయటపెట్టిన దీపిక

సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చింది దీపిక పదుకోన్. పెళ్లయిన ఆరేళ్లకు రణ్వీర్ సింగ్, దీపిక దంపతులకు ఆడ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పాపకు పేరు పెట్టారు. Advertisement రణ్వీర్-దీపిక కూతురు పేరు…

సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చింది దీపిక పదుకోన్. పెళ్లయిన ఆరేళ్లకు రణ్వీర్ సింగ్, దీపిక దంపతులకు ఆడ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పాపకు పేరు పెట్టారు.

రణ్వీర్-దీపిక కూతురు పేరు దువా పదుకోన్ సింగ్. నిజానికి ఈ పేరును ‘దుఆ’గా పలకాలి. కానీ తెలుగులో దువా అనుకోవచ్చు. ఈ పేరుకు ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానంగా పాప పుట్టిందని, అందుకే ఆ అర్థం వచ్చేలా పేరు పెట్టామని దీపిక పదుకోన్ ప్రకటించింది. అయితే పాప ముఖాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు.

ముంబయిలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చింది దీపిక. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఆమె 9 రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది.

2013 నుంచి ప్రేమించుకుంటున్నారు రణ్వీర్-దీపిక. రామ్ లీలా సినిమా వాళ్లను ఒక్కటి చేసింది. అప్పట్నుంచి సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట.. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్లకు వీళ్లు తల్లిదండ్రులయ్యారు.

7 Replies to “కూతురు పేరు బయటపెట్టిన దీపిక”

  1. ప్రార్ధన అని కూడా పెట్టుకోవచ్చు.. కాని అలాంటి సంస్కృత నామం లౌకికం కాదు కదా.. మత సామరస్యం.. మనో భావాలు.. దెబ్బతింటాయి కదా…

Comments are closed.